ETV Bharat / bharat

క్రిస్పీ అండ్​ స్పైసీ సేమియా వెజ్​ కట్​లెట్స్​ - ఇలా చేశారంటే మమ్మీ ఇట్స్​ టూ యమ్మీ అనడం పక్కా! - Crispy Veg Cutlets Recipe

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 5:04 PM IST

Crispy Semiya Veg Cutlets : సాయంత్రం స్కూల్‌ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఏదోక స్నాక్‌ ఐటమ్‌ చేసి పెట్టమని తల్లులను అడుగుతుంటారు. అయితే, ఎప్పుడూ స్నాక్‌గా నూడుల్స్, బజ్జీలు చేసి పెట్టకుండా.. ఈ సారి క్రిస్పీ సేమియా వెజ్‌ కట్‌లెట్స్‌ చేసి పెట్టండి. పిల్లలు మళ్లీ మళ్లీ అడుగుతుంటారు.

Semiya Veg Cutlets
Crispy Semiya Veg Cutlets (ETV Bharat)

Crispy Veg Cutlets Recipe Process : స్కూల్​ నుంచి వచ్చిన పిల్లలకైనా, ఆఫీసుల నుంచి వచ్చిన పెద్దలకైనా.. సాయంత్రం పూట స్నాక్స్​ తినాలని ఉంటుంది. ఇక చాలా మందికి ఈవెనింగ్స్నాక్స్‌ అనగానే ఎక్కువగా పునుగులు, బజ్జీలు, నూడుల్స్‌, మంచూరియా వంటివి గుర్తుకు వస్తాయి. అయితే, ఎప్పుడూ ఇవే తింటే చాలా బోరింగ్‌ ఉంటుంది. మరీ ముఖ్యంగా పిల్లలు ఇవి తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. కాబట్టి కొత్తగా ఏదైనా స్నాక్​ ప్రిపేర్​ చేయాలనుకునేవారు.. క్రిస్పీ సేమియా వెజ్​ కట్​లెట్​ ప్రిపేర్​ చేయండి. పైన క్రిస్పీగా.. లోపల స్పైసీగా ఉండే వీటి టేస్ట్​ అద్దిరిపోతుంది. మరి వీటికి కావాల్సిన పదార్థాలు. తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్ధాలు :

కట్లెట్స్​ కోసం:

  • ఉడికించిన బంగాళాదుంపలు -2(మీడియం సైజ్​)
  • క్యారెట్‌ తరుము- 3 టేబుల్ స్పూన్‌లు
  • అటుకులు - కప్పు
  • సన్నగా కట్​ చేసిన పచ్చిమిర్చి - 1 టేబుల్​ స్పూన్​
  • క్యాప్సికం తరగు- 2 టేబుల్‌స్పూన్‌లు
  • ఉల్లిపాయల తరుగు - పావు కప్పు
  • మొక్కజొన్న గింజలు- 3 టేబుల్ స్పూన్‌లు
  • చాట్‌ మసాలా -పావు టీ స్పూన్​
  • మిరియాల పొడి- సగం టేబుల్‌స్పూన్‌
  • కారం - అర టేబుల్​ స్పూన్​
  • ఉప్పు రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నిమ్మరసం కొద్దిగా
  • ఆయిల్‌ సరిపడా - డీప్​ ఫ్రై కి సరిపడా

కోటింగ్​ కోసం:

  • సన్నని సేమియా- 100 గ్రాములు
  • మైదా పిండి- పావు కప్పు
  • శనగపిండి- అరకప్పు
  • నీరు సరిపడినంత

తయారీ విధానం:

  • ముందుగా అటుకులను జల్లించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అటుకులను నీళ్లలో కొద్దిసేపు నానబెట్టి, వెంటనే తీసి నీళ్లు లేకుండా పిండుకుని.. ఓ ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అటుకులను చేతితో మెత్తగా చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఇందులోకి మెత్తగా ఉడికించుకున్న బంగాళాదుంపలను తురిమి వేసుకుని.. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఇందులోకి కట్లెట్​ కోసం చెప్పిన పదార్థాలు.. కార్న్‌ గింజలు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, క్యారెట్‌ తురుము, క్యాప్సికం తురుము, కొత్తిమీర, కారం, చాట్‌ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.
  • తర్వాత ఈ మిశ్రమాన్ని చేతికి నూనె రాసుకుని మీకు నచ్చిన షేప్​లో అంటే రౌండ్‌గా, హార్ట్‌లాగా నచ్చినట్లు కట్లెట్‌లు చేసి పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు ఓ గిన్నెలో మైదా పిండి తీసుకుని అందులో చిటికెడు ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మజ్జిగలా కలపండి.
  • తర్వాత శనగ పిండిలో ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోండి.
  • అలాగే సేమియాని కూడా మరొక గిన్నెలో నలిపి పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు శనగ పిండిలో కట్‌లెట్‌లను రోల్​ చేసి.. తర్వాత మైదా పిండిలో డిప్‌ చేసి.. సేమియాలో రోల్‌ చేసి పక్కన పెట్టుకోండి. సేమియా కట్‌లెట్‌కు అన్ని వైపులా అంటుకోవాలి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. ఇలా మిశ్రమం మొత్తాన్ని ప్రిపేర్​ చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి డీప్​ ఫ్రై సరిపడా నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీట్​ అయిన తర్వాత ఈ కట్‌లెట్‌లను నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. సన్నని మంట మీద ఈ కట్‌లెట్‌లను ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి.
  • ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటాయి. అంతే ఇలా సింపుల్‌గా క్రిస్పీ సేమియా వెజ్ కట్‌లెట్‌లను తయారు చేసుకోవచ్చు.

బ్రెడ్​తో ఇలా చిటికెలో బజ్జీలు చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

టేస్టీ అండ్​ స్పైసీ "బేబీ కార్న్​ మంచూరియా" - ఇలా చేశారంటే ప్లేట్లు ప్లేట్లు ఖాళీ కావాల్సిందే!

బ్రెడ్​తో స్పైసీ స్పైసీ వంటలు- తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకోవడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.