ETV Bharat / bharat

రెస్టారెంట్ స్టైల్​లో క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రై - ఈజీగా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అదుర్స్! - Crispy Potato Fry Recipe

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 3:50 PM IST

Crispy Potato Fry Recipe In Telugu : ఆలూ అంటే అందరికీ ఫేవరేట్! దాంతో కుర్మా చేసిన, కూర వండినా, వేయించినా భలే రుచికరంగా ఉంటుంది. అయితే, ఎప్పుడూ ఒకేలా తిని బోర్ కొట్టిందా? అందుకే.. ఈసారి సరికొత్తగా రెస్టారెంట్​లో స్టైల్​లో'ఆలూ ఫ్రై'ని ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. మరి, ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Crispy Potato Fry Recipe
Tasty Potato Fry (ETV Bharat)

How To Make Tasty Potato Fry Recipe : బంగాళదుంపను వేయించినా.. ఉడకబెట్టినా.. పచ్చడి చేసినా ఇంకాస్త వడ్డించమని అడగకుండా ఉండలేరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆలూతో ఎన్ని వెరైటీలు చేసినా ఇష్టంగా తింటారు. అందులో మెజార్టీ పీపుల్ ఎక్కువగా ఇష్టపడే వాటిలో.. ఆలూ ఫ్రై మొదటి వరుసలో ఉంటుంది! అంతేకాదు.. చాలా మంది పప్పు, చారు, సాంబారుకు కాంబినేషన్‌గా బంగాళాదుంప ఫ్రైని ఎంచుకుంటుంటారు. అయితే, ప్రతిసారి ఒకేలా ఆలూ(Aloo) ఫ్రై తిని బోర్​గా అనిపించొచ్చు. కాబట్టి, ఓసారి ఇలా రెస్టారెంట్​ స్టైల్​లో ట్రై చేయండి. రుచి అదిరిపోతుంది. అన్నంతోనే కాకుండా నేరుగానూ.. తినేస్తారంటే నమ్మండి! మరి, ఇంకెందుకు ఆలస్యం క్రిస్పీ క్రిస్పీగా ఉండే 'ఆలూ ఫ్రై'ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బంగాళదుంపలు - మూడు(మీడియం సైజ్​వి)
  • కారం - ఒక టీ స్పూన్
  • గరం మసాలా పొడి - పావు టీస్పూన్
  • మిరియాల పొడి - పావు టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
  • నూనె - తగినంత
  • నిమ్మరసం - కొద్దిగా
  • కరివేపాకు, పచ్చిమిర్చి

సూపర్ రెసిపీ : మసాలా ఎగ్ బుర్జీ - నషాళానికి తాకాల్సిందే! - MASALA EGG BHURJI

ఆలూ ఫ్రై తయారీ విధానం :

  • ముందుగా బంగాళదుంపలను కడిగి పొట్టు తీసుకోవాలి. ఆపై.. వాటిని మీడియం సైజ్​లో కట్ చేసుకొని ఒక బౌల్​లో కాస్త ఉప్పువేసి ఉడికించుకోవాలి.
  • అయితే, ఆలూ ముక్కలు మరీ మెత్తగా ఉడికించుకోకుండా అరవై శాతం ఉడికేలా చూసుకోవాలి. ఎందుకంటే.. మెత్తగా ఉడికితే ఫ్రై చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది.
  • బంగాళదుంప ముక్కలు ఉడికాక వాటిని ఒక బౌల్​లోకి తీసుకోవాలి. అనంతరం దానిలోనే ఒక టీ స్పూన్ కారంపొడి, ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, మిరియాల పొడిని వేసుకోవాలి.
  • అలాగే, రుచికి తగినంత ఉప్పు, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్​ను కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మరింత టేస్ట్ రావడానికి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని.. ఆ మసాలా మిశ్రమమంతా ఆలూ ముక్కలుగా పట్టేలా మ్యారినేట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కోటింగ్ కోసం.. రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా దానిలోనే రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి లేదా శనగపిండిని కూడా కలుపుకోవాలి.
  • అలాగే ఆలూ ఫ్రై కలర్​ఫుల్​గా కనిపించడానికి చిటికెడు కలర్​ను వేసుకొని ఆపై మిశ్రమమంతా ముక్కలకు పట్టేలా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న ఆలూ ముక్కలను ఒక్కొక్కటిగా వేస్తూ వాటిని మొదటిసారి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఆపై అవి కాస్త చల్లారాక మళ్లీ వాటిని స్టౌను మీడియం ఫ్లేమ్​లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసేటప్పుడు నాలుగైదు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం వాటిని సర్వింగ్ బౌల్​లోకి తీసుకొని.. దానిపై కాస్త చాట్​ మసాలా చల్లుకుంటే చాలు.. నోరూరించే క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ!

'ఆలూ మాసాలా సాండ్​విచ్' - ఇలా చేసి పెడితే - పిల్లలు 'మమ్మీ ఇట్స్​ టూ యమ్మీ' అనడం పక్కా! - Aloo Masala Sandwich Recipe

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.