ETV Bharat / bharat

దుస్తులు ఉతికేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి ! రంగు, మన్నిక గ్యారెంటీ! - Clothes Washing Tips - CLOTHES WASHING TIPS

Clothes Washing Tips : దుస్తులను ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో ఉతుకుతారు. నేరుగా కాకుండా వస్త్రాలను తిరగేసి ఉతకడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Clothes Washing Tips
Clothes Washing Tips (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 12:56 PM IST

Clothes Washing Tips : వాషింగ్ మెషీన్​​లో వేసినా, చేతులతో దుస్తులు ఉతికినా సరే ఒక్కక్కరికీ ఒక్కో పద్ధతి ఉంటుంది. కొంత మంది దుస్తులను తిరగేసి ఉతికితే ఇందకొందరు నేరుగా అంటే బయట భాగంవైపే ఉతుకుతారు. అయితే ఈ రెండింటిలో ఏది సరైన మార్గం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ దుస్తులు తిరగేసి ఉంటే ఏంటి మామూలుగా ఉంటే ఏంటి? ఎలాగోలా ఉతికేసుకుంటున్నాం కదా అని లైట్​ తీసుకోకండి. దుస్తులు ఎక్కువకాలం పాడవకుండా ఉండాలంటే ఇవన్నీ చూసుకుని ఉతకడం చాలా అవసరమని నిపుణులు అంటున్నారు.

మనం వేరు వేరు రకాల మురికి, చెమట ఉన్న వస్త్రాలను కలిపి ఉతుకుతాం. మిషన్​లో వేసినా చేతులతో ఉతికినా ఇదే పద్ధతిని పాటిస్తాం. అయితే నిపుణులు మాత్రం దుస్తులను లోపలి భాగం నుంచి అంటే తిరగేసి ఉతకడం మంచిదని అంటున్నారు. వాషింగ్​ మెషీన్​​ ఉపయోగించేటప్పుడు కొంచెం ఎక్కువ సయమం తీసుకున్నప్పటకీ ఈ పద్ధతిలో ఉతకాలని చెబుతున్నారు. అప్పుడే ఎక్కువ కాలం ఉంటాయని తెలుపుతున్నారు.

ప్రయోజనాలు

రంగు : వస్త్రాల లోపలి భాగాన్ని అంటే తిరగేసి ఉతకడం వల్ల బయట భాగంపై రాపిడి తగ్గి, వస్త్రం రంగు పోకుండా కాపాడవచ్చు. జిప్పులు, బటన్స్​ ఊడకుండా రక్షించవచ్చు. అలాగే దుస్తుల రంగు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

మరక :దుస్తులను తిరగేసి ఉతకడం వల్ల లోపలి భాగంలోని మొండి మరకలు, మురికి వంటి వాటిని సులభంగా తొలగించవచ్చు. ముఖ్యంగా అథ్లెట్స్ దుస్తులు, యూనిఫార్మ్స్ విషయంలో ఈ పద్ధతి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చెమట : జిమ్, స్నోర్ట్స్ వేర్, యూనిఫర్మ్స్ వంటి వాటికి మరకలతో పాటు చెమట కూడా ఎక్కువే. లోపలి భాగం ఉతకడం వల్ల మరకలు, చెమట చక్కగా వదిలిపోయి వస్త్రం మరింత శుభ్రమవుతుంది.

దుర్వాసన : ఈ పద్ధతిలో ఉతకడం వల్ల వస్త్రం లోతుల్లోంచి శుభ్రమవుతాయి. ఫలితంగా దుర్వాసన పోయి శుభ్రంగా మారతాయి. వేరు శరీరాల చెమట వాసన కారణంగా వచ్చే దుర్వాసనను ఈ పద్ధతి చక్కగా అరికడుతుంది.

వస్త్రం : తిరగేసి ఉతకడం వల్ల కలిగే మరో ప్రయోజనమేంటంటే బయటకు కనిపించే వస్త్రంపై ఎక్కువ రాపిడి పడదు. చేతితో ఉతికినా, వాషింగ్ మెషీన్​​లో వేసినా సరే బట్టలకు ఉపయోగించే డిటర్జెంట్ లేదా లిక్విడ్ ప్రభావం వస్త్రాన్ని పాడవకుండా కాపాడుతుంది. దుస్తులు ఎక్కువ కాలం మెరుస్తూ ఉండేందుకు ఈ పద్ధతి మీకు సహాయపడుతుంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గర్భిణీలు అన్నం తినడం మంచిదేనా? ఆరోగ్యానికి మేలు చేస్తుందా? నిపుణుల సమాధానమిదే! - Eating Rice During Pregnancy

మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు వాడటం మంచిదేనా? మనిషి ఆయుష్షు పెరుగుతుందా? నిజమేనా? - Multi Vitamin Tablets

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.