Chhattisgarh Road Accident News Today : ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. 23 మంది గాయపడ్డారు. మినీ ట్రక్కును సరుకు రవాణా వాహనం ఢీకొనడం వల్ల ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతులను పాతర్రా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని తిరయ్య గ్రామంలో జరిగిన శుభకార్యానికి వెళ్లిన బాధితులు ఆదివారం రాత్రి తిరుగుపయనమయ్యారు. వారు ప్రయాణిస్తున్న మినీ ట్రక్కును కథియా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన డ్రైవర్ ఆపారు. ఇంతలో ఓ సరకు వాహనం వచ్చి మినీ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే తొమ్మిది మంది మరణించారు.
మృతులను భూరి నిషాద్ (50), నీరా సాహు (55), గీతా సాహు (60), అగ్నియా సాహు (60), ఖుష్భూ సాహు (39), మధు సాహు (5), రికేశ్ నిషాద్ (6), ట్వింకిల్ నిషాద్ (6)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని రాయ్‌పుర్ ఆస్పత్రిలో చేర్పించారు.
కొన్నిరోజుల క్రితం, రాజస్థాన్‌లో ఝలావర్ జిల్లాలోని అకలేరాలో అతి వేగంగా వచ్చిన ఓ ట్రాలీ అదుపు తప్పి వ్యాన్‌ను ఢీకొట్టిన ఘటనలో 9 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లో ఓ వివాహ వేడకకు హాజరయ్యే తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా అకలేరా సమీపంలోని దుంగార్ గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఆ గ్రామానికి చెందిన కొంతమంది తమ బంధువుల వివాహ వేడుక కోసం శనివారం మధ్యప్రదేశ్‌కు వెళ్లారని, తిరిగి వస్తుండగా ట్రాలీ ఢీ కొట్టిందని పేర్కొన్నారు.
అదే రోజు ఉత్తర్‌పద్రేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కారు, ట్రక్కు ఢీ- 10మంది మృతి- ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం - GUJARAT ACCIDENT TODAY