ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు భద్రతా సిబ్బంది వీరమరణం - ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్

Chhattisgarh Encounter Today : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. మరో 14మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం విమానంలో రాయ్​పుర్​కు తరలించారు.

Chhattisgarh Encounter Today
Chhattisgarh Encounter Today
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 6:26 PM IST

Updated : Jan 30, 2024, 7:58 PM IST

Chhattisgarh Encounter Today : ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎన్​కౌంటర్ జరిగింది. సుక్మా- బీజాపుర్​లో సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. మరో 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హెలికాప్టర్​లో రాయ్‌పుర్​లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

సైనికులపై నక్సల్స్ కాల్పులు
Encounter In Chhattisgarh : ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ సైనికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతమని చెప్పారు. టేకులగూడ క్యాంపు నుంచి భద్రతా దళాలు ఎప్పటిలాగే మంగళవారం కూడా కూంబింగ్​కు వెళ్లాయని పేర్కొన్నారు. టేకులగూడలో నక్సలైట్లను ఏరిపారేసేందుకు సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేశాయి భద్రతా బలగాలు. సైనికుల శిబిరం అక్కడ ఉన్నప్పటి నుంచి నక్సల్స్ దాడులు కొంతమేర తగ్గాయి. కాగా, నక్సల్స్ ప్రాంతాలుగా ఉన్న జోనగూడ- అలీగూడ ప్రాంతాలకు కూంబింగ్​కు వెళ్లాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో వారిపై నక్సలైట్లు మెరుపుదాడి చేశారు. భద్రతా దళాలు సైతం ధీటుగా స్పందించాయి. నక్సల్స్, భద్రతా దళాలు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు.

2021లో 23 మంది వీరమరణం
2021 ఏప్రిల్​లో టేకులగూడలో నక్సలైట్లు, భద్రతా బలగాల మధ్య భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. నక్సల్స్ జరిపిన కాల్పుల్లో 23మంది సైనికులు వీరమరణం పొందారు. అలాగే సైనికుల వద్ద ఉన్న ఆయుధాలను సైతం దోచుకున్నారు నక్సలైట్లు.

Jammu Kashmir Encounter : జమ్ముకశ్మీర్​లో కొన్నాళ్ల క్రితం జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో ఈ ఘటన జరిగింది. భద్రతాదళాలు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్​లో మృతిచెందిన ముష్కరులను లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. పోలీసులు, సీఆర్​పీఎఫ్, ఆర్మీకి చెందిన 34 రాష్ట్రీయ రైఫిల్స్​ బృందాలు, 9 పారామిలటరీ బృందాలు ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో తనిఖీలు జరుపుతున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్​కౌంటర్​గా మారింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Jan 30, 2024, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.