Chanakya Niti for Women Personality : చాణక్యుడు గొప్ప పండితుడు. రాజనీతి వేత్తగా, తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా.. తనదైన ముద్ర వేశారు. తన ప్రముఖ రచన అయిన నీతిశాస్త్రంలో.. జీవితం, సమాజం, డబ్బు, ఆరోగ్యం(Health), వ్యాపారం, వైవాహిక జీవితం, మానవ సంబంధాలు వంటి అనేక అంశాల గురించి స్పష్టంగా వివరించారు. అందుకే, చాణక్య నీతిలో పేర్కొన్న ఎన్నో అద్భుతమైన విషయాలు నేటి తరానికీ మంచి ప్రేరణగా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు.
అదేవిధంగా చాణక్యుడు స్త్రీలపై కూడా కొన్ని అభిప్రాయాలను పంచుకున్నారు. స్త్రీల వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని అర్థం చేసుకోవడం కష్టమని తన నీతి శాస్త్రంలో వెల్లడించిన చాణక్యుడు.. మహిళలు ఏ సమయంలో సంతోషంగా ఉంటారో, ఎప్పుడు బాధగా ఉంటారో తెలుసుకోవడం సులువు కాదని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పనుల్లో ఒకటి వీరి స్వభావాన్ని అర్థం చేసుకోవడమని అన్నారు. అయితే.. కొన్ని అలవాట్ల ద్వారా స్త్రీల స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చని చెప్పారు. మరి.. ఆ అలవాట్లు ఏంటి? వాటి ద్వారా మహిళల స్వభావాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దైవారాధన : దైవ చింతనతో ఉంటూ భక్తిభావంతో మెలిగే స్త్రీలు.. ప్రశాంతమైన మనస్సుతో ఉంటారని చాణక్యుడు పేర్కొన్నారు. ఇటువంటి మహిళలు అనుకున్న లక్ష్యం సాధించడటానికి.. విజయాలను అందుకోవడానికి ఏకాగ్రతతో ఉంటారని తెలిపారు. ఇలాంటి స్త్రీలు ఇతరుల జయాపజయాలతో సంబంధం లేకుండా.. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతారట. ఎందుకంటే.. వారు తమ జీవిత లక్ష్యంలో మాత్రమే నిమగ్నమై ఉంటుందని చాణక్యుడు చెప్పారు.
సోమరితనం : లేజీగా ఉండే స్త్రీలు జీవితంలో విజయం సాధించడం కష్టమని పేర్కొన్నారు. నీతి శాస్త్రం ప్రకారం.. ఇటువంటి మహిళలు విజయం సాధించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందట. ఇలాంటి వారిని ఎవ్వరూ గౌరవించరట. ఇలాంటి వారిపై కుటుంబసభ్యులు ప్రేమ చూపించొచ్చుగానీ.. సమాజంలో మాత్రం గౌరవం లభించదని చాణక్య పేర్కొన్నారు.
మహిళగా మీరు ఆర్థిక స్వేచ్ఛ సాధించాలా? ఈ బెస్ట్ టిప్స్ మీ కోసమే!
క్రమశిక్షణ : ఈ లక్షణం ఉండే మహిళలు అనుకున్న లక్ష్యానికిి త్వరగా చేరుకుంటారని చాణక్య తెలిపారు. ఇలాంటి మహిళలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. వీరు విజయాలు సాధిస్తూ తోటి వారిని సంతోషంగా ఉంచుతారు. ఇలాంటి స్వభావం కలిగిన మహిళలు.. కుటుంబ సభ్యుల నుంచి మాత్రమే కాకుండా సమాజంలోనూ చాలా గౌరవాన్ని పొందుతారని పేర్కొన్నారు.
అసూయ : నీతి శాస్త్రం ప్రకారం.. ఈర్ష్య భావన కలిగిన స్త్రీలు తెలివితేటలతో అభివృద్ధి సాధిస్తారు. ఇతరులతో పోటీపడి గెలుపు బాటలో పయనిస్తారు. కానీ.. ఇలాంటి మహిళలు ఇతరుల పట్ల అసూయతో ఉంటారు. వారు విజయాలు సాధించకుండా అడ్డంకులు సృష్టిస్తారు. పక్కనే ఉంటూ గోతులు తవ్వేందుకు చూస్తుంటారు. కాబట్టి ఇలాంటి స్త్రీలను ఎప్పుడూ నమ్మవద్దని కౌటిల్యుడు సూచించారు. ఇలాంటి వారిని విశ్వసిస్తే.. సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ముంచేస్తారని హెచ్చరించారు.
మహిళల్లో బ్యాక్ పెయిన్ ఎందుకొస్తుంది? ఎలా రిలీఫ్ పొందాలి?