Butter Chicken Origin Issue In India : దేశంలో ప్రసిద్ధి గాంచిన 'బటర్ చికెన్', 'దాల్ మఖానీ' వంటకాలను ఎవరు కనుగొన్నారన్న అంశంపై మొదలైన న్యాయవివాదం మరింత ముదురుతోంది. దిల్లీకి చెందిన మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్ల యజమానుల మధ్య తాజాగా పరువునష్టం వ్యాఖ్యలు వివాదం సృష్టిస్తున్నాయి. ఓ వార్తాపత్రికలో బటర్ చికెన్‌ను ఎవరు కనుగొన్నారు అనే విషయంపై మోతీ మహల్ యజమానులు చేసిన వ్యాఖ్యలపై దర్యాగంజ్ దిల్లీ హైకోర్టును అశ్రయించింది దర్యాగంజ్. ఆ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు వివిధ వెబ్‌సైట్లలోనూ దర్శనమిచ్చాయని పేర్కొన్నారు. దీని వల్ల తమ రెస్టారెంట్ గౌరవానికి భంగం కలిగిందని వివరించారు.
'బటర్ చికెన్‌ను కనుగొన్నది మా వాళ్లే'
మరోవైపు ఆ ఇంటర్వ్యూలో వచ్చిన అంశం సంపాదకీయ దృక్పథమని, దానిని తమకు ఆపాదించరాదని మోతీ మహల్ యజమానులు వివరించారు. అయితే ఇందుకు సంబంధించి ఓ అఫిడవిట్‌ను దాఖలు చేయాలంటూ మోతీ మహల్ యజమానులను జస్టిస్ సంజీవ్ నరులా ఆదేశించారు. తమ పూర్వీకుడైన దివంగత కుందన్ లాల్ గుజ్రాల్ 'బటర్ చికెన్', 'దాల్ మఖానీ' వంటకాలను కనుగొన్నారని, అయితే ఆ రెండు వంటకాలపై దర్యాగంజ్ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మోతీ మహల్ యజమానులు జవరిలోనే కోర్టును అశ్రయించారు. ఇక అప్పటి నుంచే ఈ అంశంలో వివాదం మొదలైంది.
సోషల్‌మీడియాలో తొలగించిన ట్యాగ్‌లైన్
అయితే ఈ విషయంపై బటర్ చికెన్, దాల్ మఖానీ మేమే కనిపెట్టాం అనే ట్యాగ్‌లైన్‌ను ఉపయోగించకూడదు అని దర్యాగంజ్‌కు దిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అలాగే వెబ్సైట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింకెడిన్, ఎక్స్ ఇలా అన్ని సోషల్ మీడియాల నుంచి ఆ ట్యాగ్‌లైన్‌ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మోతీ మహల్ యజమానులు వేసిన దావాపై ప్రతిస్పందనగా లిఖితపూర్వక ప్రకటనను దాఖలు చేయాలని కోరింది. మోతీ మహల్ యజమానులు కోర్టులో వేసిన దావాలో తమ పూర్వీకుడు కుందన్ లాల్ గుజ్రాల్ మొదటి తందూరీ చికెన్‌ను చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత బటర్ చికెన్, దాల్ మఖానీని తయారు చేసినట్లు తెలిపారు. దేశ విభజన అనంతరం భారతదేశానికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. దీనిపై దర్యాగంజ్ యజమానులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.
రూ.60కే మీల్స్ హోమ్ డెలివరీ- డ్వాక్రా మహిళల 'లంచ్ బాక్స్' సూపర్ హిట్! - Lunch Bell Kudumbashree