ETV Bharat / bharat

BSFలో తొలి మహిళా స్నైపర్‌- చరిత్ర సృష్టించిన సుమన్ కుమారి - first woman bsf sniper

BSF First Woman Sniper : బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్‌గా హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సుమన్‌ కుమారి చరిత్ర సృష్టించారు. ఇందౌర్‌లోని 'సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (CSWT)'లో కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ఆమె ఇటీవలే 'ఇన్‌స్ట్రక్టర్' గ్రేడ్ పొందారు.

BSF First Woman Sniper
BSF First Woman Sniper
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 8:14 AM IST

BSF First Woman Sniper : పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్​(BSF)ది కీలక పాత్ర. ఇంతటి కీలక సాయుధ దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్‌గా హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సుమన్‌ కుమారి చరిత్ర సృష్టించారు. ఇందౌర్‌లోని 'సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (CSWT)'లో కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ఆమె ఇటీవలే 'ఇన్‌స్ట్రక్టర్' గ్రేడ్ పొందారు. మాటువేసి, దూరం నుంచే శత్రువుపైకి గురి తప్పకుండా కాల్పులు జరిపేవారిని 'స్నైపర్‌'లుగా పిలుస్తారు.

BSF First Woman Sniper
బీఎస్​ఎఫ్ తొలి మహిళా స్నైపర్ సుమన్ కుమారి

కఠినమైన శిక్షణను తట్టుకుని విజయం
2021లో BSFలో చేరిన సుమన్​ కుమారి పంజాబ్‌లో ఓ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. సరిహద్దుల వద్ద స్నైపర్‌ దాడుల ముప్పును గమనించారు. ఈ క్రమంలోనే సంబంధిత కోర్సులో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. 'వాస్తవానికి స్నైపర్‌ శిక్షణ కఠినంగా ఉంటుంది. ఇందులో చేరాలనుకునేవారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. ట్రైనింగ్‌ను తట్టుకోవడం కష్టమని భావిస్తూ చాలామంది పురుషులే వెనకడుగు వేశారు' అని అధికారులు పేర్కొన్నారు. ఆమె పట్టుదల చూసి ఉన్నతాధికారులు అనుమతించారు. ఎనిమిది వారాలపాటు సాగిన శిక్షణలో 56 మందిలో ఆమె ఒక్కరే మహిళ కావడం విశేషం.

'నేర్చుకోవాలన్న సంకల్పంతో'
ట్రైనింగ్‌లో సుమన్‌ కుమారి ఎంతో ప్రతిభ కనబరిచారని కృషి, నేర్చుకోవాలన్న సంకల్పమే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయని శిక్షణాధికారులు ప్రశంసించారు. స్నైపర్ శిక్షకురాలిగా ఆమె అర్హత సాధించారని 'సీఎస్‌డబ్ల్యూటీ' ఐజీ భాస్కర్‌ ఓ వార్తాసంస్థతో తెలిపారు. హిమాచల్‌లోని మండీ జిల్లాకు చెందిన సుమన్‌ కుమారి తల్లి గృహణి కాగా, తండ్రి ఎలక్ట్రీషియన్. తాను సాధించిన ఘనతను చూసి మరింత మంది మహిళలు భద్రతా బలగాల్లో చేరేందుకు ముందుకొస్తారని ఆమె ఆశిస్తున్నారు.

హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
తమ కుమార్తె సుమన్ కుమారి బీఎస్​ఎఫ్​లో మొట్టమొదటి మహిళా స్నైఫర్​గా చరిత్ర సృష్టించడంపై ఆమె తల్లిదండ్రులు స్పందించారు. తమ కుమార్తె సాధించిన విజయాల పట్ల గర్వపడుతున్నామని చెప్పారు. సుమన్ కుమారి ధైర్య సాహసాల గురించి ప్రస్తుతం దేశం మొత్తం చర్చించుకుంటుందని అన్నారు.

రిటైర్డ్​ ఉద్యోగికి స్పెషల్​ ఫేర్​వెల్- బ్యాండు మేళాలతో గుర్రపు బగ్గీపై ఊరేగింపు

వికసిత్‌ భారత్- 2047పైనే ఫోకస్​- కేంద్ర మంత్రిమండలి సుదీర్ఘ చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.