ETV Bharat / bharat

జీలం నదిలో పడవ బోల్తా - ఆరుగురు మృతి- 10మంది గల్లంతు - Boat Capsized In Jammu Kashmir

Boat Capsized In Jammu Kashmir : జమ్ముకశ్మీర్‌లోని జీలం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో 10మంది గల్లంతయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Boat Capsized In Jammu Kashmir
Boat Capsized In Jammu Kashmir
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 10:10 AM IST

Updated : Apr 16, 2024, 12:17 PM IST

Boat Capsized In Jammu Kashmir : జమ్ముకశ్మీర్‌లోని జీలం నదిలో పడవ బోల్తా పడింది. శ్రీనగర్‌ సమీపంలోని గాంద్​బల్​ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 10మంది గల్లంతయ్యారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గల్లంతైనవారి కోసం ప్రమాద స్థలంలో ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ పడవలో పాఠశాల విద్యార్థులు సహా పలువురు ఉన్నారు. వారంతా గాంద్​బల్​ నుంచి బట్వారాకు వెళ్తున్నారు. ఈ ప్రమాదం నుంచి పలువురిని కాపాడారు. గల్లంతయిన వారి సంఖ్య తెలియాల్సి ఉంది. అయితే గత దశాబ్ద కాలంగా గాంద్​​బాల్​ నుంచి శ్రీనగర్​ను కలిపే వంతెన నిర్మాణం జరుగుతోందని, దీంతో ప్రజలు నదిని దాటాలంటే పడవలను ఆశ్రయించాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. ఈ వంతెనను నిర్మించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని అన్నారు.
ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పడవలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉండాలని తాను ఆశిస్తున్నానని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

మరోవైపు గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జమ్ముకశ్మీర్​లోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జీలం సహా పలు నదుల నీటి మట్టాలు పెరిగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ భారీ వర్షాలు కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల సోమవారం జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేశారు.

Last Updated : Apr 16, 2024, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.