BJP Second List 2024 Loksabha Elections : సార్వత్రిక ఎన్నికల్లో 370కి పైగా సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ- 72 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషీతో పాటు హరియాణా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పేర్లు ఉన్నాయి. ఊహించినట్లుగానే ఖట్టర్ కర్నాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
ఇటీవల 195 మందితో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ- తాజాగా 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ (6)తో పాటు దాద్రానగర్ హవేలీ (1) దిల్లీ (2), గుజరాత్ (7), హరియాణా(6), హిమాచల్‌ప్రదేశ్(2), కర్ణాటక (20), మధ్యప్రదేశ్ (5), మహారాష్ట్ర(20), త్రిపుర (1), ఉత్తరాఖండ్ (2) రాష్ట్రాల్లో చొప్పున అభ్యర్థులను ఖరారు చేసింది.
సెకెండ్ లిస్ట్‌లో ప్రముఖులు వీరే
రెండో జాబితాలో కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషీ, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, శోభా కరంద్లాజేతో పాటు మాజీ సీఎంలు మనోహర్‌లాల్ ఖట్టర్, త్రివేంద్రసింగ్ రావత్, బసవరాజ్ బొమ్మై వంటి ప్రముఖులకు చోటు లభించింది.
- మహారాష్ట్రలోని నాగ్‌పుర్- నితిన్ గడ్కరీ
- ముంబయి నార్త్ - పీయూష్ గోయల్
- మహారాష్ట్ర బీద్- పంకజ ముండే
- హిమాచల్‌ప్రదేశ్‌లోని హమిర్‌పుర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్హరియాణాలోని కర్నాల్ నుంచి మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్
- కర్ణాటకలో ధార్వాడ్ నుంచి ప్రహ్లాద్ జోషీ
- కర్ణాటక హవేరీ నుంచి మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై
- బెంగళూరు రూరల్ నుంచి డా. సీఎన్ మంజునాథ్
- బెంగళూరు నార్త్ నుంచి కేంద్రమంత్రి శోభా కరాంద్లాజే
- బెంగళూరు సౌత్ నుంచి తేజస్వీ సూర్య
- షిమోగ నుంచి మాజీ సీఎం యడియూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర
- ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి మాజీ సీఎం త్రివేంద్రసింగ్ రావత్
- గర్హ్వాల్ నుంచి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలౌనీ
పెండింగ్‌లో రెండు సీట్లు
ఇక తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు దక్కింది. ఆదిలాబాద్- గోడెం నగేశ్, పెద్దపల్లి- గోమాస శ్రీనివాస్, మెదక్- రఘునందన్‌రావు, నల్లగొండ- శానంపూడి సైదిరెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్‌కు సీతారాం నాయక్‌ను ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించింది బీజేపీ. తాజా ప్రకటనతో రాష్ట్రంలో మొత్తం 15 స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యారు. మిగతా 2 స్థానాలు (ఖమ్మం, వరంగల్) స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.
కొద్దిరోజుల ముందే 195 అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది కమలం పార్టీ.
- యూపీ వారణాసి నుంచి వరుసగా మూడోసారి బరిలోకి దిగనున్నారు ప్రధాని మోదీ
- గుజరాత్ గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- యూపీ లఖ్‌నవూ నుంచి రాజ్‌నాథ్ సింగ్
- రాజస్థాన్ అమేఠీ నుంచి స్మృతి ఇరానీ
- న్యూదిల్లీ నుంచి దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సురీ స్వరాజ్ తొలిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు.
'ఎలక్టోరల్ బాండ్ల వివరాలు అందాయ్- అప్పుడే అన్నీ బయటపెడతాం!'
నిన్న సీఎంగా, నేడు ఎమ్మెల్యేగా ఖట్టర్ రాజీనామా- ఇక బాధ్యతంతా నాయబ్దే!