Siddaramaiah Slams BJP : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ విఫలయత్నం చేసిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక్కొక్కరికి రూ.50 కోట్లు చొప్పున మొత్తం 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ లంచం ఇవ్వజూపిందని ఆయన ఆరోపించారు. అయితే తమ ఎమ్మెల్యేలు ఎవరూ ఆ లంచం తీసుకోవడానికి అంగీకరించలేదని, అందుకే బీజేపీ తనపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆయన అన్నారు.
"ఈ సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించిది. మొత్తం 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు చొప్పున ఇస్తామని ఆఫర్ చేసింది. ఇంతకీ వారికి (బీజేపీ) ఇంత డబ్బు ఎలా వచ్చింది? మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నేత ఆర్.అశోక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర డబ్బులు ఏమైనా ముద్రిస్తున్నారా? లేదు.
వాస్తవానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇస్తామని చెప్పిన డబ్బు అంతా బీజేపీ లంచాల రూపంలో సంపాదించిన డబ్బు. నిజానికి వారు లాంచాల రూపంలో కోట్లాది రూపాయాలు సంపాదించారు. ఇప్పుడు ఆ డబ్బును ఉపయోగించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. "
- సిద్ధరామయ్య, కర్ణాటక సీఎం
మైసూర్ జిల్లాలోని టి.నరసిపుర అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.470 కోట్ల విలువైన ప్రజాపనులు ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపక్ష బీజేపీపై ఈ తీవ్ర ఆరోపణలు చేశారు.