BJP Lok Sabha Election Manifesto : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప పత్ర' పేరుతో దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కలిసి ఆదివారం మేనిఫెస్టోను ప్రకటించారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో 14 అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ రూపొందించింది. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా సంకల్పపత్ర రూపకల్పన చేశారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది. ఇందుకోసం 4లక్షల మంది పంపిన 15 లక్షల సలహాలు, సూచనలను పరిశీలించి కీలకాంశాలను పొందుపరిచింది.
మేనిఫెస్టో విడుదల కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. 'బంగాల్, అసోం, ఒడిశా, కేరళ, తమిళనాడులో ఈరోజు పండుగలు జరుపుకుంటున్నారు. నవరాత్రుల్లో భాగంగా ఇవాళ కాత్యాయనీ దేవి పూజ చేసుకుంటాం. ఇవాళ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి కూడా. సంకల్ప్ పత్ర తయారుచేసిన రాజ్‌నాథ్ బృందానికి అభినందనలు. సంకల్ప్ పత్ర తయారీకి సూచనలు ఇచ్చిన లక్షలమందికి అభినందనలు. నాలుగు స్తంభాలతో సంకల్ప్ పత్రకు పునాదులు వేశాం. యువశక్తి, నారీశక్తి, గరీబ్, కిసాన్‌ను దృష్టిలో ఉంచుకునే సంకల్ప్ పత్ర తయారీ చేశాం. దేశ యువత ఆకాంక్షలను మా సంకల్ప్ పత్ర ప్రతిబింబిస్తోంది. ఈ పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. మోదీ పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం' అని మోదీ చెప్పారు. అనంతరం, విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడావికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ వంటి మేనిఫెస్టోలో పొందుపర్చిన 14 అంశాలను వివరించారు.
మేనిఫెస్టోలోని కీలక హామీలు
- 70 ఏళ్లు పైబడిన వృద్ధిలకు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
- పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు కట్టించడం
- పైపు ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందజేత
- వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేసే దిశగా కృషి
- దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం
- ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్
- మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులకు మార్చే ప్రణాళిక
ముద్ర రుణాల పరిమితి పెంపు
- ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు
- డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు
- కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు
- మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
- మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు
- ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం
- సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహించడం
- నానో యూరియా వినియోగం మరింత పెంచడం
UCC, జమిలి ఎన్నికలపై హామీ
- చిన్నరైతుల లబ్ధి కోసం శ్రీఅన్న సాగు ప్రోత్సాహం
- స్వయం సహాయక సంఘాలకు మరింత మద్దతు
- ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటు
- తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి
- యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయడం
- జమిలి ఎన్నికల నిర్వహణ
- అంతరిక్షంలో భారతీయ స్పేస్ స్టేషన్ నిర్మించడం
- ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిర్మించడం
ఐరాస భద్రతా మండలిలో శాస్వత సభ్యత్వం దిశగా ప్రయత్నం - ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే కొత్త శాటిలైట్ పట్టణాల ఏర్పాటు
- విమానయాన రంగానికి ఊతం
- వందేభారత్ విస్తరణ
- దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోనూ బుల్లెట్ రైలు
- రక్షణ, వంటనూనె, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి
- గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహం
- గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్, లీగల్ ఇన్సూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌ల ఏర్పాటు
- అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు కచ్చితమైన ప్రణాళిక
- విదేశాల్లోని భారతీయుల భద్రతకు హామీ
140 కోట్ల ప్రజలకు లాభం
14 అంశాలతో మేనిఫెస్టోను తయారు చేశామని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. 'మోదీ సూచనల మేరకే వికసిత్ భారత్ కోసం సంకల్ప్ పత్ర రూపొందించాం. అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో సంకల్ప్ పత్ర తయారుచేశాం. బీజేపీ మాటలు, పనులు, ఆకాంక్షలన్నీ దేశహితం కోసమే. 140 కోట్ల ప్రజలకు లాభం చేకూర్తే సరికొత్త ప్రణాళిక తయారుచేశాం' అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
-
#WATCH | BJP 'Sankalp Patra'/manifesto release: Defence Minister Rajnath Singh says, "Today, in India's politics, 'Modi ki Guarantee' is considered as pure as 24-carat gold. So, I don't hesitate to say that BJP manifesto is the gold standard for the political parties in not only… pic.twitter.com/wLj0cTJXRq
— ANI (@ANI) April 14, 2024
పేదల జీవితాల్లో మార్పు కోసమే
వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో తమ మేనిఫెస్టో చెబుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. 'ప్రధాని మోదీ నేతృత్వంలో పదేళ్లుగా దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. అయోధ్యలో రామాలయ స్వప్నాన్ని సాకారం చేశాం. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370ని రద్దు చేశాం. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. పేదల జీవితాల్లో మార్పు రావాలనేదే మా లక్ష్యం. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేదే మా నినాదం' అని జేపీ నడ్డా అన్నారు.
-
#WATCH | BJP 'Sankalp Patra'/ manifesto release: BJP national president JP Nadda says, "You gave us a clear mandate and clear results came. You gave a clear mandate and Article 370 was abrogated..."
— ANI (@ANI) April 14, 2024
On Ram Mandir, he says, "...we also saw those days when Congress lawyers used to… pic.twitter.com/KfvFWddDDd