ETV Bharat / bharat

పక్షుల కోసం పెళ్లి చేసుకోని 'బర్డ్‌మ్యాన్'- అలా జరుగుతుందనే భయంతో! - Bird Man Of Bihar - BIRD MAN OF BIHAR

Bird Man Of Bihar : బిహార్‌కు చెందిన రంజిత్ కుమార్ పాసవాన్​ అనే వ్యక్తి తన జీవితమంతా పక్షులకు సేవ చేయడానికి అంకితం చేశాడు. స్థానికుల చేత బర్డ్‌మ్యాన్ అని పిలిపించుకొనే రంజిత్, పక్షుల సేవ కోసం చేసిన త్యాగం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Bird Man Of Bihar
Bird Man Of Bihar (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 11:45 AM IST

Bird Man Of Bihar : కొంతమందికి కొన్ని విషయాలపై ఎనలేని ఇష్టం ఉంటుంది. కొందరికి మొక్కలు పెంచడం ఇష్టమైతే, ఇంకొంతమందికి పక్షులు పెంచడం ఇష్టంగా ఉంటుంది. అలా పక్షులపై ప్రేమను పెంచుకున్న ఓ వ్యక్తి వాటి కోసం తన సమయం అంతా వెచ్చిస్తున్నాడు. ఒకవేళ వివాహం జరిగితే ఈ పక్షులతో ఉన్న బంధం కోల్పోతానేమో అని ఏకంగా ఆ ఆలోచనే పక్కన పెట్టేశాడు. అతనే బీహార్‌లోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంబాగ్​లో నివసించే రంజిత్ కుమార్ పాసవాన్​.

Bird Man Of Bihar
పక్షులకు ఆహారం ఇస్తున్న రంజిత్ కుమార్ (ETV Bharat)

పక్షులకు దూరం అవ్వాల్సివస్తుందని
రంజిత్ పాసవాన్​కు పక్షులంటే విపరీతమైన ప్రేమ. తన ఇంట్లోనే వివిధ జాతుల పక్షులను ఉంచి జాగ్రత్తగా చూసుకునే రంజిత్, జీవిత భాగస్వామి వచ్చిన తర్వాత పక్షులకు దూరం అవ్వాల్సి వస్తుందని, అందుకే పెళ్లి చేసుకోలేదని చెబుతున్నాడు. తన తాత, నాన్నలకు కూడా పక్షుల పెంపకం అంటే చాలా ఇష్టమని, వారి నుంచే తాను ఈ ప్రేమించే గుణాన్ని వారసత్వంగా పొందానని అంటున్నాడు రంజిత్.

Bird Man Of Bihar
రంజిత్ కుమార్ పెంచుతున్న పక్షి (ETV Bharat)

రంజిత్ దినచర్య ఎలా సాగుటుందంటే
పొద్దున్న నిద్ర లేచిన వెంటనే రంజిత్ తన బర్డ్‌హౌస్‌ వైపు వెళ్లి వాటికి ఆహారం అందిస్తాడు. రోజులో ఎక్కువ సమయం వాటి మధ్యే గడుపుతాడు. రంజిత్ వచ్చే అలికిడికి, అతడి గొంతుకు పక్షులు సైతం స్పందిస్తాయి. ఒకవేళ రంజిత్ పనిమీద బయటకు వెళ్లినప్పుడు పక్షులు అతడి కోసం ఎదురు చూస్తాయి. రంజిత్ గొంతు వినగానే సవ్వడి చేసి స్వాగతం పలుకుతాయి. అర్ధరాత్రి అయినా సరే తాము అతడి కోసం ఎదురుచూస్తున్నామన్న భావం వచ్చేలా అలికిడి చేస్తాయి.

"మా కుటుంబం అంతా జంతువులను, పక్షులను ప్రేమిస్తాం. మా ఇంట్లో పిల్లలు కూడా వాటిని చాలా ఇష్టపడతారు. అసలు నా రోజు వాటితోనే ప్రారంభమవుతుంది" అని చెప్పాడు రంజిత్ పాసవాన్​.

ప్రస్తుతం రంజిత్ దగ్గర 20 నుంచి 25 రకాల దేశీ పక్షులు ఉన్నాయి. వీటితో పాటూ మకావు, కాకా టౌ, కార్డినల్ లోరీ, గాలా కాకాటూ , మొలుకాన్, చాటరింగ్ లోరీ టౌకాన్, హైసింత్ మకావ్, పామ్ కాకాటూ, స్టాగ్ బీటిల్ వంటి విదేశీ జాతులు కూడా ఉన్నాయి. పక్షుల కోసం రంజిత్ తన సొంత ఇంటిలో ఒక సౌకర్యవంతమైన పక్షుల షెడ్‌(బర్డ్ హౌస్)ను నిర్మించాడు. పక్షులు ఎగరాటానికి, నివసించటానికి అనుగుణంగా వివిధ ఏర్పాట్లు కూడా చేశాడు. అందుకే స్థానిక ప్రజలు రంజిత్‌ను బర్డ్‌మ్యాన్‌గా పిలుస్తారు.

భారత్​లో US స్డూడెంట్ వీసా ప్రక్రియ షురూ- గతేడాది రికార్డ్​ బ్రేక్- ఒక్కరోజే 4వేలు! - US Student Visa India

'నీట్‌'లో గ్రేస్‌ మార్కుల నిర్ణయం వెనక్కి- జూన్​ 23న మళ్లీ ఎగ్జామ్: సుప్రీంకు కేంద్రం - NEET UG 2024 Result

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.