Bihar Floor Test : ఎన్‌డీఏతో కలిసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఈ బల పరీక్షలో నెగ్గి ఎన్‌డీఏతో ప్రభుత్వాన్ని కొనసాగించాలని సీఎం నితీశ్ కుమార్ పట్టుదలతో ఉన్నారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు బలం కలిగిన ఎన్‌డీఏ బల పరీక్షలో గెలుపు ఖాయం ధీమాగా ఉన్నారు. మరోవైపు బల పరీక్షలో ఎలాగైన ఓడించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎన్డీయేతో పాటు మహా కూటమి పార్టీలు తంటాలు పడుతున్నాయి. అందులో భాగంగా తాజాగా జేడీయూ ఎమ్మెల్యేలను పట్నాలోని చాణక్య హోటల్‌కు తరలించారు.
అంతకుముందు ఆదివారం సాయంత్రం జరిగిన మీటింగ్‌కు పలువురు జేడీయూ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో కొంతమందికి ఆర్జేడీ నుంచి ఆఫర్లు వచ్చినట్లు సమాచారం.
బిహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులు ఉండగా 128 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఎన్‌డీఏ సర్కారు విజయం తమదే అని విశ్వాసంతో ఉంది. ఈ క్రమంలో నితీశ్ కుమార్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఈ బల పరీక్షకు తప్పని సరిగా రావాలని విప్‌ను జారీ చేశారు.
మరోవైపు నీతీశ్‌ను ఓడించాలని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పావులు కదుపుతోంది. ఈ మేరకు జేడీయూ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇక తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఆర్జేడీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఆదివారం పట్నా చేరుకున్న ఎమ్మెల్యేలను ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ నివాసానికి తరలించారు. ఈ క్రమంలో తేజశ్వి యాదవ్ నివాసం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
-
#WATCH | Patna, Bihar: Heavy police force deployed outside former Deputy CM Tejashwi Yadav's residence. More details awaited. pic.twitter.com/gp7rTt4tFE
— ANI (@ANI) February 11, 2024
-
VIDEO | Here’s what Bihar Congress president Dr Akhilesh Prasad Singh (@akhileshPdsingh) said after Congress MLAs' arrival at Patna Airport from Hyderabad ahead of tomorrow's floor test.
— Press Trust of India (@PTI_News) February 11, 2024
"All our MLAs are with us, and they all will be present in the Assembly tomorrow." pic.twitter.com/JaqyHCnjnj
ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న ఆర్జేడీ నేత అవధ్ బిహారీ చౌదరిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ యాదవ్ అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశారు. బలపరీక్షలో నెగ్గి ఎన్‌డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటై అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ విషయంపై సోమవారమే అసెంబ్లీలో పోరాడేందుకు ఆర్జేడీ సిద్ధంగా ఉంది.
అయోధ్య రామయ్య దర్శనానికి యోగి టీమ్- దేవుడు, భక్తుల మధ్య దూరం లేదన్న ఎస్పీ!
'లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క బీజేపీకే 370 సీట్లు- కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం పక్కా!'