ETV Bharat / bharat

మీ జీవితం ఏడుపు నుంచి బయటపడాలంటే - ఈ 7 అలవాట్లు అలవర్చుకోండి! - సక్సెస్​ మీ కాళ్ల ముందు ఉంటుంది! - SuccessFul People Morning Habits - SUCCESSFUL PEOPLE MORNING HABITS

Successful People Morning Habits : ప్రతి ఒక్కరికీ ఒక్కోరకమైన అలవాట్లు ఉంటాయి. అవే వారి జీవితాన్ని ఎటువైపు వెళ్లాలో నిర్ణయిస్తాయి. ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి ఎదగాలన్నా, అట్టడుగు స్థానానికి పడిపోవాలన్నా ఈ అలవాట్లే చేస్తాయి. మరి.. జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఎలాంటి అలవాట్లు ఉండాలో మీకు తెలుసా? డైలీ మార్నింగ్ ఈ అలవాట్లను అలవర్చుకుంటే చాలు అంటున్నారు మానసిక నిపుణులు. అవేంటో చూద్దాం.

Morning Habits Of SuccessFul People
SuccessFul People Morning Habits (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 9:58 AM IST

Best Morning Habits Of Successful People : మంచి జీవితం కోసం ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. అయితే.. ఆ కలను సాకారం చేసుకోవడంలో మన దినచర్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా లైఫ్​లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నిద్రలేవడం : లైఫ్​లో సక్సెస్ సాధించాలంటే ప్రతి ఒక్కరూ డైలీ మార్నింగ్ త్వరగా నిద్రలేచే అలవాటు అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. కానీ, ఈరోజుల్లో చాలా మంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవట్లేదు. కానీ.. ఇది మీ జీవితాన్నే మార్చేస్తుంది. ముఖ్యంగా ఈ హ్యాబిట్ మీ రోజును ఉత్సాహంగా మొదలు పెట్టేలా చేస్తుంది. పని చేయడానికి మీకు తగినంత శక్తిని ఇస్తుందని చెబుతున్నారు.

వాటర్ తాగడం : రోజూ ఉదయం మీరు ఫాలో అవ్వాల్సిన మరో గుడ్ హ్యాబిట్ ఏంటంటే.. రాత్రి నిద్ర తర్వాత మీ బాడీని రీ-హైడ్రేట్ చేయడానికి నిద్ర లేచిన వెంటనే 2 గ్లాసుల గోరు వెచ్చని వాటర్ తాగడం. ఈ నీరు మీ జీవక్రియను కిక్‌స్టార్ట్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. అంతేకాదు.. వివిధ శారీరక విధులకు మంచి బూస్టింగ్ ఇస్తుందని చెబుతున్నారు.

మెడిటేషన్ : లైఫ్​లో విజయం సాధించాలంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. కాబట్టి, మానసిక ప్రశాంతత కోసం డైలీ.. మెడిటేషన్, యోగా వంటివి సాధన చేయడానికి కొన్ని నిమిషాలు కేటాయించుకోవాలని సూచిస్తున్నారు. ఇవి ఒత్తిడిని తగ్గించడంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతాయని చెబుతున్నారు.

వ్యాయామం : మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే రోజూ మార్నింగ్ పాటించాల్సిన మరో అలవాటు.. వ్యాయామం. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్తీగా ఉంటాం. ఇది మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. ఫిజికల్​గా, మెంటల్​గా ఫిట్​గా ఉన్నవారు సరైన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఎక్కువ. కాబట్టి డైలీ లైఫ్​లో వ్యాయామానికి కొంత సమయం కేటాయించేలా ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు.

జీవితంలో విజయం సాధించాలంటే - అందరూ చేసే ఈ తప్పులు చేయకండి బ్రో!

టిఫెన్ : ఈరోజుల్లో చాలా మంది టైమ్ లేకనో, మరో కారణం చేతనో బ్రేక్​ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. దాంతో సరైన శక్తి లభించక ఆ రోజంతా డల్​గా ఉంటారు. కాబట్టి, అలాకాకుండా మీరు డైలీ మంచి పోషకాలు నిండి ఉన్న బ్రేక్​ఫాస్ట్​ను తీసుకునేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఫలితంగా శరీరానికి తగిన శక్తి లభించడమే కాకుండా ఆ రోజంతా మిమ్మల్ని యాక్టివ్​గా ఉంచుతుందని చెబుతున్నారు. అంటే.. పండ్లు, తృణధాన్యాలు, గుడ్లు, నట్స్ వంటి ప్రొటీన్ అధికంగా ఉండే వాటిని ఎంచుకోవాలంటున్నారు.

ప్రణాళిక : మీరు ఆ రోజూవారి చేయాల్సిన పనులేంటి? ఏ టైమ్​లో ఏ పని చేయాలి? అనేది ఓ చిన్న పేపరు మీద రాసుకొని జేబులో పెట్టుకోండి. దాదాపుగా మెజారిటీ జనం దీన్నొక సిల్లీ పాయింట్​గా చూస్తారు. కానీ.. ఆ రోజు మీ పనులు అనుకున్న టైమ్​కు పూర్తికావడంలో ఈ చిన్న పేపరు ముక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా.. కంటిన్యూ చేయండి. "అయ్యో.. ఆ పని మర్చిపోయానే, ఒహ్హో.. ఆ పనికూడా ఉంది కదా.. టైమ్ లేదు ఎలా?" అనే పరిస్థితి రాకుండా చూస్తుంది ఆ పేపర్ పీస్.

సోషల్ ​మీడియా : జీవితంలో మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలంటే మీరు అలవర్చుకోవాల్సిన మరో మంచి హ్యాబిట్.. సోషల్ మీడియాను పరిమితం చేయడం. చాలా మందికి సోషల్ మీడియాను ఉపయోగించడం రాదు. ఒక టైమ్ అనేది లేకుండా.. ఖాళీ దొరికితే అందులో మునిగిపోతారు. దీనివల్ల మీకు తెలియకుండానే ఎంతో టైమ్ కిల్ అయిపోతుంది. అందుకే.. సోషల్ మీడియాకు ఒక టైమ్ పెట్టుకోండి. ఆ టైమ్​లో మాత్రమే చూడాలని మీకు మీరూ రూల్ పెట్టుకోండి.

ఇవన్నీ ఒక నెలపాటు ఫాలో అయితే.. మీరు ఎంతగా మారిపోయారో.. ఎంత టైమ్ సేవ్ చేస్తున్నారో.. మీ గోల్​ వైపు ఎంత ఫాస్ట్​గా వెళ్తున్నారో.. మీకే స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. మరి.. ఇంకెందుకు లేట్? ఇవాళ్టి నుంచే మొదలు పెట్టండి!

సక్సెస్​ ఫుల్ స్టూడెంట్స్​కు - ఈ అలవాట్లు ఉండవు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.