Indian Railway Favourable Acts For Women Travellers : ఇండియాలో చౌకైన ప్రజా రవాణా మార్గాలలో ఒకటి రైలు మార్గం. అందుకే.. చాలా మంది దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సివచ్చినప్పుడు రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతుంటారు. ఇందుకు అనుగుణంగా ఇండియన్ రైల్వే కూడా ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు కొత్త పథకాలు, మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే మహిళలు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. మరి.. ఇండియన్ రైల్వే(Indian Railway) మహిళలకు కల్పిస్తున్న ఆ సౌకర్యాలేంటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైళ్లలో సాధారణంగా సీనియర్ సిటిజన్ కోటా ఉంటుంది. ఈ కోటా కింద 60 సంవత్సరాలు దాటిన వారు టికెట్ బుక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అదే మహిళలకైతే ఈ ఏజ్ లిమిట్ 45 ఏళ్లే. పైగా వారికి లోయర్ బెర్త్ కేటాయిస్తారు. దీంతోపాటు సీనియర్ సిటిజన్ విభాగంలోనే కాకుండా.. మహిళలందరి కోసం కూడా కొన్ని సీట్లు ప్రత్యేకంగా కేటాయిస్తోంది రైల్వేశాఖ. ఈరోజుల్లో చాలా మంది మహిళలు దూర ప్రాంతాలకు ఒంటరిగానే ప్రయాణిస్తున్నారు. అలాంటి టైమ్‌లో వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.
ఆ సమయాల్లో జనరల్ టికెట్‌తో - స్లీపర్ క్లాస్ బోగీలో ప్రయాణించొచ్చు!
ఎవరైతే ఆడవారు కుటుంబంతో కాకుండా ఒంటరిగా ప్రయాణించాల్సి వస్తుందో.. ఆ మహిళల కోసం కేటాయించే కోటాలో వారు టికెట్ బుక్ చేసుకోవచ్చు. రైళ్లలో మహిళలకు ప్రత్యేక బోగీ ఉంటుంది. అందులో పురుషులకు ప్రవేశం ఉండదు. 12 ఏళ్లలోపు బాలురకు మాత్రమే అనుమతి ఇస్తారు. అలాకాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి పురుషులు మహిళా కంపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తే.. మహిళల ఫిర్యాదు మేరకు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది భారతీయ రైల్వేశాఖ. 1989 ఇండియన్ రైల్వే చట్టం ప్రకారం.. మిలటరీ సిబ్బందికి మాత్రమే మహిళల బోగీలోకి ఎంట్రీ ఉంటుంది.
టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కితే..
ఇండియన్ రైల్వే చట్టం ప్రకారం.. మహిళా ప్రయాణికులు పొరపాటున టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తుంటే వారిని బయటకు పంపేందుకు టీటీఈకి అనుమతి లేదు. ఫైన్ చెల్లించి ఆ మహిళ తన జర్నీ కంటిన్యూ చేయవచ్చు. ఒకవేళ తను ఆ ఫైన్ చెల్లించలేని స్థితిలో ఉంటే అప్పుడు కూడా టీటీఈకి తన మీద యాక్షన్ తీసుకునేందుకు ఎటువంటి అధికారమూ ఉండదు. ఒకవేళ ఆడవారిని ట్రైన్లోంచి దిగమని చెప్పాలన్నా.. వారితో మాట్లాడాలన్నా కచ్చితంగా మహిళా కానిస్టేబుల్ మాత్రమే ఆ పని చేయగలరు. అంతేకాదు.. మహిళల భద్రత కోసం భారత రైల్వే శాఖ సీసీటీవీలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో లేకపోతే.. దానిపై ఫిర్యాదు చేసే అధికారం కూడా మహిళలకు ఉందనే విషయాన్ని గమనించాలి.
అర్జెంట్‌గా ట్రైన్‌కు వెళ్లాలా? డోంట్ వర్రీ - 5 మినిట్స్ ముందు కూడా టికెట్ బుక్ చేసుకోండిలా!