ETV Bharat / bharat

సైక్లింగ్ చేస్తుండగా ఢీకొట్టిన క్యాబ్- ఇంటెల్ మాజీ హెడ్ కన్నుమూత - Avtar Saini passed away

Avtar Saini Accident : ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ ఇండియా మాజీ అధ్యక్షుడు అవతార్ సైనీ(68) కన్నుమూశారు. సైక్లింగ్ చేస్తున్న సమయంలో ఆయన్ను ఓ క్యాబ్ ఢీకొట్టింది. సైనీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

Avtar Saini Accident
Avtar Saini Accident
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 12:31 PM IST

Updated : Feb 29, 2024, 2:54 PM IST

Avtar Saini Accident : ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ ఇండియా మాజీ అధ్యక్షుడు అవతార్ సైనీ(68) కన్నుమూశారు. నవీ ముంబయి టౌన్​షిప్​లో గురువారం ఉదయం సైక్లింగ్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ క్యాబ్ వచ్చి ఆయన్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనను తోటీ సైక్లిస్టులు ఆస్పత్రికి తరలించగా- అప్పటికే చనిపోయారని వైద్యులు ప్రకటించారు.

ఈ ప్రమాదం బుధవారం ఉదయం 5.50 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన క్యాబ్ డ్రైవర్​పై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. సైనీని ఢీకొట్టిన తర్వాత డ్రైవర్​ అక్కిడినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని చెప్పారు. అయితే నిందుతుడి ఇంకా అరెస్టు చేయలేదని ఎన్​ఆర్​ఐ పోలీస్​ స్టేషన్​ అధికారి ఒకరు తెలిపారు. సైనీ చనిపోయిన విషయాన్ని అమెరికాలో ఉన్న ఆయన పిల్లలకు తెలియజేశారు.

సైక్లింగ్​​ ప్యాషన్
సైక్లింగ్ అవతార్​ సైనీ CACG అనే సైక్లింగ్ గ్రూప్‌లో ఉన్నారు. ట్రెక్కింగ్ సైక్లింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ సేఫ్టీ పరికరాలు ధరించేవారని సమాచారం.

ఇంటెల్​ ఇండియా తీవ్రవిచారం
Avtar Saini Intel : అవతార్ సైనీ మృతిపై ఇంటెల్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. విజయవంతమైన ఆవిష్కర్తగా, అత్యుత్తమ నాయకుడిగా, విలువైన మార్గనిర్దేశకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొంది. అయితే సైనీ ఇంటెల్​కు 22 ఏళ్ల పాటు సేవలందించారు.

ఇంటెల్ 386, 486 మైక్రోప్రాసెసర్ల అభివృద్ధిలో అవతార్ సైనీ కీలక పాత్ర పోషించారు. పెంటియం ప్రాసెసర్ డిజైన్ చేసిన బృందానికి నాయకత్వం వహించారు. ఇంటెల్ దక్షిణాసియా విభాగానికి డైరెక్టర్​గానూ వ్యవహరించారు. సైనీ భార్య మూడేళ్ల క్రితమే కన్నుమూశారు. కుమార్తె, కుమారుడు అమెరికాలో ఉంటున్నారు.

అవతార్ సైనీ మరణం బాధకలిగించిందని ఇంటెల్​ ఇండియా మాజీ మేనేజర్, ఇంటెల్ సౌత్ ఆసియా డైరెక్టర్ గోకుల్​ వీ సుబ్రమణియన్ ఎక్స్​లో ట్వీట్​ చేశారు. భారత్​లో ఇంటెల్​ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో సైనీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన 1982 నుంచి 2004 వరకు ఇంటెల్​లో పనిచేస్తున్నప్పుడు అనేక ప్రాసెసర్​ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని చెప్పారు.

కస్టమ్స్​ ఆఫీసర్​ పేరుతో 250మంది మహిళలకు గాలం- పెళ్లి పేరుతో మోసం- చివరకు చిక్కాడిలా!

సందేశ్​ఖాలీ నిందితుడు షేక్ షాజహాన్ అరెస్ట్- టీఎంసీ, బీజేపీ మాటల యుద్ధం

Last Updated : Feb 29, 2024, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.