Akharas Amirt Snan Resume : తొక్కిసలాట ఘటన నేపథ్యంలో వాయిదా పడిన సాధువుల అమృత్ స్నానం తిరిగి ప్రారంభమైంది. వేర్వేరు అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమంలో బుధవారం మధ్యాహ్నం పవిత్ర స్నానం చేశారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ల ద్వారా సాధువులపై పూలవర్షం కురిపించారు.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP | Saints and Nagas head towards Triveni Sangam for the Amrit Snan on the occasion of Mauni Amavasya. pic.twitter.com/ptjbp3hHWP
— ANI (@ANI) January 29, 2025
#WATCH | #Mahakumbh | Prayagraj: Flower petals showered on saints and seers taking a holy dip at Triveni Sangam on the occasion of Mauni Amavasya. pic.twitter.com/pKZsKA5ahU
— ANI (@ANI) January 29, 2025
తొక్కిసలాట కారణంగా అఖాడాలకు చెందిన సాధువులు అమృత స్నానాన్ని కొన్ని గంటల పాటు వాయిదా వేసుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ మేరకు అఖాడాలకు విజ్ఞప్తి చేశారు. తెల్లవారుజామున సాధువులంతా అమృత స్నానానికి సిద్ధమైన వేళ తొక్కిసలాట ఘటన వార్త తెలిసిందని, అందుకే తాము ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నామని భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షులు మహంత్ రవీంద్ర పూరి వెల్లడించారు. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం నుంచి అనుమతి వస్తే అమృత స్నానం ఆచరిస్తామని వెల్లడించారు. మధ్యాహ్నం తిరిగి సాధువుల స్నానం తిరిగి ప్రారంభమైంది.
#WATCH | #KumbhOfTogetherness | Prayagraj, UP | Naga sadhus head towards Triveni Sangam for the Amrit Snan on the occasion of Mauni Amavasya. pic.twitter.com/ghxBdRbZ0i
— ANI (@ANI) January 29, 2025
భారీగా నిలిచిపోయిన వాహనాలు
ప్రయాగ్‌రాజ్‌లో భారీ జన సంద్రం కారణంగా మధ్యప్రదేశ్-ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దుల్లో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. వేలాది మంది భక్తులు ఉన్న వాహనాలు మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లా చక్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిహద్దులో చిక్కుకున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. భక్తుల కోసం ఆహారం, వసతిని ఏర్పాటు చేసినట్టు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పోలీసులు భద్రతాపరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని, పలు వైద్య బృందాలను సైతం అందుబాటులో ఉంచామని చెప్పారు. భక్తులు అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.
ప్రముఖల స్నానం
మౌనీ అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణిసంగమంలో అమృతస్నానాలు ఆచరిస్తున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే భక్తులు భారీసంఖ్యలో ఘాట్లకు తరలివచ్చారు. బుధవారం ఉదయం మధ్యాహ్నం 12 గంటల వరకు 4.24 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు చేశారు. దేశంలో నాలుగు మఠాలకు చెందిన శంకరాచార్యులు త్రివేణి సంగమానికి చేరుకుని అమృతస్నానం ఆచరించారు. బీజేపీ ఎంపీ హేమమాలిని, యోగాగురు బాబా రాందేవ్ త్రివేణిసంగమంలో అమృత స్నానాలు ఆచరించారు.
#MahaKumbh2025 | Prayagraj, UP: Drone visuals from the Ghats of Triveni as a huge number of devotees reach for the Amrit Snan on the occasion of Mauni Amavasya.
— ANI (@ANI) January 29, 2025
As of 12 pm today, about 4.24 crore devotees have taken a holy dip. The total number of devotees who have taken a holy… pic.twitter.com/vOAAnlAhOm