ETV Bharat / bharat

'ఆలూ మాసాలా సాండ్​విచ్' - ఇలా చేసి పెడితే - పిల్లలు 'మమ్మీ ఇట్స్​ టూ యమ్మీ' అనడం పక్కా! - Aloo Masala Sandwich Recipe - ALOO MASALA SANDWICH RECIPE

Aloo Masala Sandwich Recipe : డైలీ ఇడ్లీ, దోశ, ఉప్మా తినలేం మమ్మీ అని మీ పిల్లలు మారాం చేస్తున్నారా? అయితే ఈసారి వెరైటీగా ఆలూ మాసాలా సాండ్​విచ్​ ప్రిపేర్ చేసి పెట్టండి. బ్రేక్​ఫాస్ట్ లేదా స్నాక్స్ టైమ్​లో ఈ రెసిపీ చేసి పెట్టారంటే సూపర్ టేస్ట్ మమ్మీ అనడం పక్కా! ఇంతకీ, దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Aloo Masala Sandwich
Aloo Masala Sandwich Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 5:26 PM IST

How to Make Aloo Masala Sandwich in Telugu : ఎవరికైనా డైలీ బ్రేక్​ఫాస్ట్​ సమయంలో లేదా స్నాక్స్ టైమ్​లో ఒకే రకం ఆహారాలను పెడితే నచ్చదు. ఇక పిల్లలు అయితే.. డైలీ ఇడ్లీ, ఉప్మా, దోశయేనా మమ్మీ అని తినకుండా మారాం చేస్తుంటారు. రోజూ తిన్నవే తిని బోర్ కొడుతుందంటారు. కాబట్టి ఈసారి వారికి బోర్​గా అనిపించకుండా కొత్తగా.. ఆలూ మసాలా సాండ్​విచ్ చేసి పెట్టండి. దీని కోసం మిగతా బ్రేక్​ఫాస్ట్​(Breakfast) ఐటమ్స్​లా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సమయంలో దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని వేడివేడిగా తింటే రుచి అదిరిపోతుంది. ఇవి రెండు మూడు తినగానే పొట్ట నిండిన భావన కలుగుతుంది. అంతేకాదు.. ఈ రెసిపీలో ఉపయోగించే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ ప్రాసెస్​లో ఆలూ మసాలా సాండ్​విచ్​ను.. ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెట్టారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • బ్రెడ్ ముక్కలు - నాలుగు
  • బంగాళదుంప - 1
  • బఠానీలు - పావు కప్పు
  • టమాట కెచప్ - రెండు స్పూన్లు
  • ఉల్లిపాయ - ఒకటి
  • గరం మసాలా పొడి - పావు స్పూన్
  • మిరియాల పొడి - పావు స్పూను
  • ఉప్పు - రుచికి సరిపడా
  • బటర్ - కొద్దిగా
  • పుదీనా చట్నీ - రెండు స్పూన్లు
  • చాట్​ మసాలా - అర టీ స్పూన్​

బ్రేక్​ఫాస్ట్​గా రోజూ దోశ తినొచ్చా? తింటే ఏం అవుతుంది? డాక్టర్ల సమాధానమిదే!

ఆలూ మసాలా సాండ్‌విచ్ రెసిపీ తయారీ విధానం :

  • ముందుగా బంగాళదుంప, బఠానీలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  • అలాగే ఈ రెసిపీలోకి కావాల్సిన పుదీనా చట్నీని ముందే ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు ఒక బౌల్​లో ఉడికించిన ఆలుగడ్డను తీసుకొని చేత్తో బాగా నలిపి మెత్తగా చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉడికించుకున్న బఠానీలు, తగినంత సాల్ట్, గరం మసాలా, మిరియాల పొడి, చాట్ మసాలా వేసుకొని ఆ మిశ్రమాన్ని చేతితోనే బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం రెండు బ్రెడ్ ముక్కలు తీసుకొని అందులో ఒక ముక్కపై టమాట కెచప్​ను రాసుకోవాలి. మరో బ్రెడ్​ ముక్కపై పుదీనా చట్నీని అప్లై చేసుకోవాలి.
  • ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఆ రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో కొద్దిగా వేసి వాటిని సాండ్​విచ్​ లాగా చేత్తో నొక్కుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌపై ప్యాన్ పెట్టి కొద్దిగా బటర్​ వేసుకొని ఆ సాండ్​విచ్​ను రెండు వైపులా టోస్ట్ చేసుకోవాలి. అంతే.. నోరూరించే టేస్టీ టేస్టీ ఆలూ మసాలా సాండ్​విచ్ రెడీ!

క్షణాల్లో టిఫెన్స్​ రెడీ - టేస్ట్​ అండ్​ హెల్త్​ కూడా సూపర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.