Ajaz Khan Election Run Flops : దూకుడు, బాద్షా, హార్ట్ఎటాక్, టెంపర్ లాంటి తెలుగు మూవీల్లో విలన్‌గా నటించిన అతనికి ఇన్‌స్టాలో 5.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. బిగ్ బాస్ షోతో అతని పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. దీనితో తనకు తిరుగులేదనుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే 155 ఓట్లు వచ్చాయి. ఈ ఘోర ఓటమితో రియాలిటీలోకి వచ్చాడు ప్రముఖ నటుడు అజాజ్ ఖాన్. ఇంతకూ ఏమైందంటే?
సినిమా నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన అజాజ్ ఖాన్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) టికెట్‌తో ఆయన వెర్సోవా అసెంబ్లీ స్థానంలో నిలబడ్డారు. కానీ ఆయన తలరాత తిరగబడింది. సోషల్ మీడియాలో ఆయనకు తిరుగులేని పాపులారిటీ ఉన్నప్పటికీ, ఎన్నికల్లో మాత్రం 155 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీనితో ఈ విషయం వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు.
- 'సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్నంత మాత్రన అది ఎన్నికల్లో ఓట్లను రాలుస్తుందని భవించకూడదు. కచ్చితంగా రియాలిటీ చెక్ చేసుకోవాలి' అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
- 'సోషల్ మీడియాలో ఉపయోగించే ఫిల్టర్లు, హ్యాష్‌ట్యాగ్‌లు రాజకీయాల్లో పనిచేయవని మరోసారి రుజువు అయ్యింది. ఇన్‌స్టా రీల్స్‌ను ప్రజాస్వామ్యంలో ఎవరూ పట్టించుకోరు' అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్రలోని వెర్సోవా అసెంబ్లీ నియోజకవర్గంలో శివసేన (యూబీటీ) అభ్యర్థి హరూన్ ఖాన్ 65,396+ ఓట్లతో ఘన విజయం సాధించారు. ఆయనకు బీజేపీ అభ్యర్థిని డాక్టర్ భారతి లావేకర్ (63,796 ఓట్లు) గట్టిపోటీనిచ్చారు. నోటా ఖాతాలో 1298 ఓట్లు పడ్డాయి. దారుణం ఏమిటంటే అజాజ్ ఖాన్‌కు నోటా కంటే చాలా తక్కువగా ఓట్లు వచ్చాయి.
Meet Ajaz Khan
— maithun (@Being_Humor) November 23, 2024
Instagram followers - 56 Lakhs
Family Members - 72
Total Votes - 43
😂😂😂😂 pic.twitter.com/XBbAAAXfdL
Ajaz Khan who has 5.6 million followers on insta got 79 votes.
— Sagar (@sagarcasm) November 23, 2024
When you realise 16 year olds cannot vote in State Elections unlike Bigg Boss evictions pic.twitter.com/j8ohPl62tV
నటి స్వర భాస్కర్ భర్త ఓటమి
మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రముఖ నటి స్వర భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ కూడా ఓటమి పాలయ్యారు. అయితే తన భర్త ఓటమికి ఈవీఎం మానిప్యులేషనే కారణమని స్వరభాస్కర్ ఆరోపిస్తున్నారు.
"రోజంతా పని చేసిన తరువాత కూడా ఆ ఈవీఎం మిషన్లు 99 శాతం ఛార్జింగ్‌తో ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం? ఇది బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా చేసిన మానిప్యులేషన్. అందుకే నా భర్త ఓడిపోయారు."
- స్వర భాస్కర్
ఫహద్ అహ్మద్ మొదటిసారిగా ఎన్సీపీ (ఎస్పీ) పార్టీ తరఫున అనుశక్తి నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆయనపై వెటరన్ ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కుమార్తె సనా మాలిక్ పోటీ చేసి ఘన విజయం సాధించారు. అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ తరఫున పోటీ చేసిన ఆమె అహ్మద్‌పై ఏకంగా 3,378 ఓట్ల తేడాతో గెలిచారు.