ETV Bharat / bharat

లోక్‌సభ విజేతల సగటు ఓట్లు 50.58%- 297మందికే సగానికి పైగా ఓట్లు - Lok Sabha Polls winners voting - LOK SABHA POLLS WINNERS VOTING

ADR Report On Lok Sabha Polls Winners Voting : లోక్​సభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు మొత్తం పోలైన ఓట్లలో సగటున 50.58 శాతం ఓట్లను సాధించారని ఏడీఆర్​ నివేదిక పేర్కొంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 2 శాతం మేర తగ్గినట్లు వెల్లడించింది.

ADR Report On Lok Sabha Polls Winners Voting
ADR Report On Lok Sabha Polls Winners Voting (ETV Bharat, ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 8:35 AM IST

ADR Report On Lok Sabha Polls Winners Voting : లోక్‌సభ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో విజేతలు సగటున 50.58 శాతం ఓట్లను సాధించారని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2శాతం ఓట్లు తగ్గినట్లు పేర్కొంది. లోక్​సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం 543 నియోజకవర్గాలకుగాను 542 స్థానాల్లో ఓట్ల షేరింగ్​పై సమగ్ర విశ్లేషణను ఏడీఆర్, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (న్యూ) 2024 విడుదల చేశాయి. సూరత్​ స్థానంలో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినందుకున్న దానిని విశ్లేషణ నుంచి మినహాయించాయి. ఈ లోక్​సభ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో 279మంది తమ నియోజకవర్గాల్లో సగానికి పైగా ఓట్లు సాధించారని నివేదిక తెలిపింది.

నివేదిక ప్రకారం బీజేపీకి చెందిన 239 మంది విజేతల్లో 75 మంది (31 శాతం) 50 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు చెందిన 99 మంది విజేతల్లో 57 మందికి (58 శాతం) 50 శాతం కంటే తక్కువ ఓట్లు సాధించారు. ప్రాంతీయ పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి 37 మంది విజేతల్లో 32 మంది (86 శాతం), టీఎంసీ నుంచి 29మందిలో 21 మంది (72 శాతం), డీఎంకే నుంచి 22 మందిలో 14 మంది (64 శాతం) 50 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. క్రిమినల్‌ కేసులున్న 251 మంది విజేతల్లో 106 మంది (42 శాతం) 50 శాతంపైన ఓట్లతో విజయం సాధించగా, ఎటువంటి కేసులు లేని 291 మంది విజేతల్లో 173 మంది (59 శాతం) 50 శాతానికి పైగా మెజారిటీతో గెలుపొందారు.

ఇక మొత్తం విజేతల్లో 503మంది కోటీశ్వరులు ఉన్నాయి. కాగా ఇందులో 262 మంది (52 శాతం) 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలుపొందారు. కోటీశ్వరులు కాని 39 మందిలో 17 మంది (44 శాతం) కూడా సగానికి పైగా ఓట్లు సాధించారు. అయిదుగురు అభ్యర్థులు 2,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. 542 మందిలో 74 మంది మహిళల విజేతలు ఉన్నారు. వీరిలో త్రిపుర తూర్పు నుంచి కృతిదేవి (బీజేపీ) 68.54 శాతం ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. తిరిగి ఎన్నికైన 214 మందిలో 101 (47 శాతం) మంది 50 శాతానికి పైగా ఓట్లతో, 92 మంది మాత్రం 10 శాతం కంటే తక్కువ తేడాతో విజయం సాధించారు. ఈ ఏడాది మొత్తం ఓట్లలో నోటాకు 0.99 శాతం పడగా, 2019లో 1.06 శాతం, 2014లో 1.12 శాతంగా ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం 66.12 కాగా 2019లో 67.35 శాతం నమోదైంది.

మోదీ రష్యా పర్యటన- యుద్ధం తర్వాత మొదటిసారి- పుతిన్​తో కీలక భేటీ!

ఆస్పత్రి నుంచి ఎల్​కే అడ్వాణీ డిశ్చార్జ్‌- వారంలో రెండోసారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.