Actor Darshan Murder Case : కన్నడ స్టార్ హీరో దర్శన్ ఓ హత్య కేసులో అరెస్ట్ కావడంపై శాండల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ స్పందించారు. మృతుడు రేణుకాస్వామి, అతడి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని అన్నారు. ఒక్కరు తప్పు చేయటం వల్ల మొత్తం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వచ్చిందన్నారు.
నిందితుడికి శిక్ష పడితే అంతా సెట్ : కిచ్చ సుదీప్
ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడిన సుదీప్, ప్రస్తుతం ప్రజలు సమాచారం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం లేదని, మీడియా ఏం చూపిస్తుందో అదే అందరూ నమ్ముతున్నారన్నారు. మరణించిన రేణుకాస్వామికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దర్శన్ భార్యకి, బిడ్డకి కూడా న్యాయం జరగాలన్నారు. ఈ కేసులో ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సుదీప్‌కు దర్శన్ స్నేహితుడే కదా అని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా, స్నేహం వేరు న్యాయం కోరుకోవడం వేరన్నారు. ఈ హత్య, దర్శన్- పవిత్ర అరెస్టుతో మొత్తం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకే చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. ఎంతో మంది శ్రమ వల్ల ఎదిగిన కన్నడ ఇండస్ట్రీకి, ఇప్పుడు ఒక్క వ్యక్తి వల్ల నింద పడింది చెప్పారు. నిందితుడికి శిక్ష పడితే పరిశ్రమ ఊపిరి పీల్చుకుంటుంది అని సుదీప్ వెల్లడించారు.
దేశమంతా గమనిస్తోంది : ఉపేంద్ర
ఈ హత్య విషయంపై కన్నడ నటుడు ఉపేంద్ర, దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఇలాంటి క్రూరమైన కేసులో ఎవరైనా పబ్లిక్ ఫిగర్ పట్టుబడినప్పుడు, ఆధారాలన్నీ పబ్లిక్‌గా ఉంచాలని ఉపేంద్ర ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
అసలేం జరిగిందంటే
జూన్ 9న కర్ణాటకలోని సుమన్నహళ్లి బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని మృతదేహం దొరికింది. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత డెడ్ బాడీని చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిగా గుర్తించారు అధికారులు. రేణుకా స్వామి ఓ ఫార్మాసీ కంపెనీలో పనిచేసేవారని తెలిపారు. అనంతరం దర్యాప్తులో భాగంగా కొంతమంది అనుమానితులను అరెస్ట్ చేసి విచారించగా ఇందులో హీరో దర్శన్ ప్రమేయం కూడా ఉన్నట్లు వారు చెప్పారు.
కన్నడ నటి పవిత్ర గౌడతో దర్శన్‌కు రిలేషన్ ఉన్నట్లు గతంలో రూమర్స్ భారీగా వచ్చాయి. దర్శన్‌తో తనకు సంబంధం ఉన్నట్లు ఆమె వివాదాస్పద పోస్ట్ కూడా చేసింది. దీంతో పవిత్ర గౌడ - దర్శన్ భార్య విజయ లక్ష్మి మధ్య వివాదం కూడా నడిచింది. అనంతరం నటి పవిత్ర గౌడపై రేణుకాస్వామి కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని కించపరిచే పోస్ట్‌లు చేశారట. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినట్లు తెలిసింది. ఈ కారణంతోనే రేణుకా స్వామి హత్య జరిగినట్లు కన్నడ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఆ తప్పిదం వల్లే బంగాల్ ట్రైన్ యాక్సిడెంట్! రెడ్ సిగ్నల్ వేసినా! - West Bengal Train Accident
5రోజుల్లో లక్ష మందిని కలిసిన ముఖ్యమంత్రి- జెట్ స్పీడ్‌లో కొత్త సీఎం