9 Years Old Boy Murder In Bastar : ఓ వ్యక్తి మీద ఉన్న పగతో అతడి తొమ్మిదేళ్ల బాలుడిని అతి దారుణంగా హత్య చేశాడు యువకుడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లాలో జరిగింది. ప్రతీకారం తీర్చుకోవాలనే కారణంగా చిన్నారిని కిడ్నాప్ చేసి భయపెట్టాలని నిందితుడు తొలుత అనుకున్నాడు. కానీ ఆ తర్వాత బాలుడిని కత్తితో గొంతు కోసి చంపేశాడు.
ఇదీ జరిగింది!
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం జిల్లాలోని ఉసిరీబెడా గ్రామానికి చెందిన గౌతమ్ వర్మకు ఒక మొబైల్ దుకాణం ఉండేది. అదే గ్రామానికి చెందిన నిందితుడు నితీశ్ కుశ్వాహా(19) కుటుంబానికి, గౌతమ్ వర్మకు చాలా కాలంగా గొడవలు జరుగుతుండేవి. ఈ వివాదాల కారణంగా గౌతమ్ వర్మపై నితీశ్ ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించాడు. అందుకోసం గౌతమ్ కుమారుడు వేద్ వర్మ(9)ను కిడ్నాప్ చేయాలని అనుకున్నాడు. మంగళవారం సాయంత్రం వేద్ వర్మ ఇంటి దగ్గర ఉన్న దుకాణం ముందు ఆడుకుంటున్న సమయంలో నిందితుడు వెళ్లి తనతో రావాలని అడిగాడు. అందకు వేద్ వర్మ నిరాకరించాడు. దీంతో నిందితుడు చాక్లెట్ ఇస్తానని, అలానే బైక్‌పై తిప్పుతానని చెప్పి ఆ బాలుడిని తీసుకెళ్లాడు.
కొంత దూరం వెళ్లాక నితీశ్ తన స్నేహితుడి బైక్‌పై ఎక్కించుకుని వెళ్లి చిన్నారిని కిడ్నాప్ చేశారు. జగదల్‌పుర్ దగ్గరలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి చిన్నారిని హత్య చేశాడు. ముందు తాడుతో గొంతు నుమిలి హత్య చేసేందుకు ప్రయత్నించారు. కానీ చిన్నారి చనిపోవటం లేదని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అక్కడే మృతదేహాన్ని వదిలేసి ఇద్దరూ పారిపోయారు.
వేద్ వర్మ కనిపించకపోవటం వల్ల గౌతమ్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చివరిసారిగా నిందితుడు నితీశ్‌తో బాలుడు కనిపించాడని తెలిసింది. దీంతో నితీశ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసు విచారించగా తానే హత్య చేసిన్నట్లు ఒప్పుకున్నాడు. అయితే నిందితుడు డ్రగ్స్ బానిస అని, చిన్నారికి ఇచ్చిన చాక్లెట్లో కూడా మత్తు పదార్ధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడికి సాయపడిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పుర్‌లో ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రామ్‌పుర్‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో నివాసం ఉంటున్న బీజేపీ నేత కుమార్తె 8వ తరగతి చదువుతోంది. కొద్ది రోజుల నుంచి ఆమెను కొందరు వేధిస్తున్నారు. పాఠశాల నుంచి వచ్చే సమయంలో కునాల్ గుప్తా, ఓం వశిష్ఠ, అభిషేక్ అనే ముగ్గురు యువకులు కలిసి బాలికను వేధించేవారు.
ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు మంగళవారం ఆ యువకుల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడారు. బాలిక జోలికి రాకుడదని ఒప్పందాన్ని చేసుకున్నారు. అయితే ఇది జరిగిన కొద్ది గంటలకే యువకులు బాలిక ఇంటికి వచ్చి అత్యాచారం చేస్తామని, అసభ్యకరమైన వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని తల్లిదండ్రలు ఆ ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భార్యపై అనుమానం- నోట్లో కరెంట్ వైర్ పెట్టి హత్య చేసిన భర్త
మద్యం మత్తులో పక్కింటి బాలుడి హత్య- పొలంలో మృతదేహం వేసి పరార్- పీక్కు తిన్న జంతువులు