ETV Bharat / bharat

ఎన్నికల వేళ జమ్ముకశ్మీర్​లో ఉగ్ర కలకలం- ఒకేరోజు రెండు ఎన్​కౌంటర్లు- ఇద్దరు టెర్రరిస్టులు హతం - Jammu kashmir Encounter - JAMMU KASHMIR ENCOUNTER

Jammu Kashmir Encounter : మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జమ్ము కశ్మీర్‌లో ఒకే రోజు రెండు ఎన్‌కౌంటర్లు కలకలం రేపాయి. ఓ ఘటనలో నలుగురు సైనికులు గాయపడగా, మరో ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు.

source ANI
Jammu Kashmir Encounter (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 10:19 PM IST

Jammu Kashmir Encounter : జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది. అక్కడ వరుసగా ఎన్‌ కౌంటర్లు జరగడం కలవరం రేపుతోంది. తాజాగా కఠువాలో జరిగిన ఎన్​కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టింది భారత సైన్యం. మరోవైపు కిశ్త్‌వాడ్‌ జిల్లాలో జరిగిన మరో ఎన్​కౌంటర్‌లో నలుగురు సైనికులు గాయ పడ్డారు. ఈ విషయాన్ని సైనిక వర్గాలు వెల్లడించాయి. మరి కొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లోనే ఈ ఎన్‌కౌంటర్లు జరగడం గమనార్హం.

నలుగురు సైనికులకు గాయాలు, ఇద్దరు ఉగ్రవాదాలు హతం - కిశ్త్‌ వాడ్‌లోని ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని మొదటగా ఇంటలిజెన్స్‌ నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం, జమ్ముకశ్మీర్‌ పోలీసులతో కలిసి ఆపరేషన్‌ చేపట్టింది. శుక్రవారం(సెప్టెంబర్ 13) మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఉగ్ర వాదులు ఉన్న ప్రాంతాన్ని సైనికులు గుర్తించారు. అనంతరం భద్రతా దళాలు - ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు సైనికులు గాయపడ్డారు.

వారిని దగ్గర్లోని కమాండ్‌ సెంటర్‌కు తరలించారు. ఉగ్రవాదుల కోసం భద్రత దళాలు ఇంకా వేట కొనసాగిస్తున్నాయి. జులైలో డోడా జిల్లాలో నలుగురు సైనికులు మరణించిన ఘటనలో ఈ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు సైనిక వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు కఠువా జిల్లాలో జరిగిన ఎన్‌ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు భారత సైనికులు.

మరి కొన్ని రోజుల్లోనే చీనాబ్ లోయలోని కిశ్త్‌వాడ్‌, డోడా, రాంబన్‌ జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలోనే వరుస ఎన్‌కౌంటర్లు జరగడం కలవరం సృష్టిస్తున్నాయి. దక్షిణ కశ్మీర్‌ అనంత్‌నాగ్‌, షోపియన్‌, పుల్వామా, కుల్గాం జిల్లాల్లోని 16 అసెంబ్లీ స్థానాల్లో ఎలెక్షన్స్​ జరగనున్నాయి. సెప్టెంబర్‌ 18న ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

రూ.25లక్షల బీమా, నెలకు రూ.3వేలు​- జమ్ముకశ్మీర్ ప్రజలకు కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలు - Jammu and Kashmir Election

'జైళ్లు నన్ను బలహీనపరచలేవు- నా కరేజ్​ 100రెట్లు పెరిగింది'- తిహాడ్​ జైలు నుంచి కేజ్రీవాల్​ విడుదల - Arvind Kejriwal Tihar Jail

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.