national

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 10:23 AM IST

ETV Bharat / snippets

ఇదేం పిచ్చిరా బాబు - రీల్​ చేయబోయి ప్రాణాలు తీసుకున్నాడు!

Young Man Died while Making a Reel
Young Man Died while Making a Reel (ETV Bharat)

Young Man Died while Making a Reel :రీల్స్​ చేయాలనే పిచ్చి ఆ యువకుడి ప్రాణాలనే తీసుకుంది. మెడకు ఉరి వేసుకొని సెల్​ఫోన్​లో చిత్రీకరించే క్రమంలో మెడకు తాడు బిగుసుకుపోవడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్​ జిల్లా నర్సంపేటలో మంగళవారం రాత్రి జరిగింది. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది.

నర్సంపేటకు చెందిన యువకుడు అజయ్ ఓ హోటల్​లో పని చేస్తున్నాడు. మంగళవారం తన చిన్నక్క ఇంటికి వెళ్లి రీల్​ చేసే క్రమంలో సెల్​ఫోన్​ను ఫ్రిజ్​పై ఉంచి దూలానికి ఉరి వేసుకుంటూ దానిని చిత్రీకరించాలనుకున్నాడు. ఈ క్రమంలో తాడు బిగుసుకుపోవడంతో మృతి చెందాడు. కుమారుడి మృతిపై​ తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details