ETV Bharat / snippets

కోర్టు ధిక్కరణ కేసు - ఐఏఎస్ ప్రవీణ్‌ ప్రకాశ్‌, ఎంవీ శేషగిరిబాబులకు జైలు శిక్ష

HC Orders Jail to IAS Praveen Prakash
HC Orders Jail to IAS Praveen Prakash (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2024, 2:13 PM IST

HC Orders Jail to IAS Praveen Prakash : ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని పాఠశాల విద్యాశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, ఇంటర్మీడియట్‌ బోర్డు అప్పటి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబులకు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇరువురి న్యాయవాదుల అభ్యర్థన మేరకు తీర్పు అమలును నాలుగు వారాలు సస్పెండ్‌ చేసింది.

తమ తీర్పుపై అప్పీల్‌ కోర్టు స్టే ఇవ్వకపోతే జైలుశిక్ష అమలు నిమిత్తం ఈ నెల 21న హైకోర్టు రిజిస్ట్రార్‌ జ్యుడిషియల్‌ ముందు లొంగిపోవాలని ప్రవీణ్‌ప్రకాష్, శేషగిరిబాబుకు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గత నెల 24న ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.