national

సైబర్​ నేరాలతో రూ.3 కోట్లకు పైగా టోకరా - వరంగల్​లో తమిళనాడు దంపతుల అరెస్ట్

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2024, 2:19 PM IST

CYBER CRIME IN WARANGAL
Tamilnadu Couple Arrest in Warangal (ETV Bharat)

Tamilnadu Couple Arrest in Warangal : సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులిద్దరూ మొత్తం 16 కేసుల్లో సుమారు రూ.3 కోట్లకు పైగా నగదును అపహరించిన్నట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడు చెందిన జసిల్, ప్రీతి దంపతులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో పాటు విలువైన సమాచారంతో కూడిన పెన్​డ్రైవ్​లను స్వాధీనం చేసుకున్నారు.

గత నెలలో హనుమకొండకు చెందిన ఓ వ్యాపారి సైబర్ నేరాగాళ్ల తప్పుడు సమాచారంతో ఓ నకిలీ వెబ్​సైట్​లో సుమారు రూ.28 లక్షల నగదును డిపాజిట్ చేసి మోసపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details