ETV Bharat / snippets

కారణం లేకుండా పోలీసులు చితకబాదారు సార్!

author img

By ETV Bharat Telangana Team

Published : 7 hours ago

Police Beat A Person on Police Station
Police Beat A Person on Police Station (ETV Bharat)

Police Beat A Person on Police Station : తనకు సంబంధం లేని విషయంలో స్టేషన్​కు తీసుకెళ్లి చేయి విరిగేలా పోలీసులు చితకబాదారని ఓ వ్యక్తి ఆరోపించాడు. వివరాల్లోకి వెళితే, కుత్బుల్లాపూర్​లో షాపూర్​నగర్​లోని ఓ కల్లు కాపౌండ్​ వద్ద రమేశ్​ నాయక్​ అనే వ్యక్తి మద్యం సేవించడానికి వెళ్లాడు. పక్కన కొందరు డబ్బు విషయంలో గొడవపడ్డారు. అదే క్రమంలో 100కు సమాచారం ఇచ్చారు చుట్టుపక్కల వాళ్లు. గొడవ వద్దు, ఎవరి డబ్బులు వారే తీసుకొని వెళ్లండి అని మధ్యవర్తిగా మంచిమాటలు చెప్పిన పాపానికి పోలీసులు స్టేషన్​కు తీసుకెళ్లారు. డబ్బులు, మొబైల్​ నువ్వే తీశావ్​ అంటూ పోలీసులు చితకబాదారు. తన చేయిని పోలీసులు విరగొట్టారని తీవ్రంగా కొట్టి పంపించారని సురేశ్​ కన్నీరుమున్నీరయ్యాడు. కూలీ చేసుకొని బతికే వాళ్లం ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకొనే డబ్బులు లేవని కన్నీటిపర్యాంతమయ్యాడు. తనను చిత్రహింసలు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సురేశ్​ వేడుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.