ETV Bharat / snippets

మా ఉద్యోగాలు మాకు ఇచ్చి ఆదుకోండి - డీజీపీకి హోంగార్డుల విజ్ఞప్తి

author img

By ETV Bharat Telangana Team

Published : 8 hours ago

HOME GUARDS JOB ISSUE IN TELANGANA
Home Guards about their Job Issue (ETV Bharat)

Telangana Home Guards about their Job Issue : సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హోంగార్డులు కోరారు. వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 మందిని సర్వీస్‌ నుంచి తప్పించారని బాధిత హోంగార్డులు తెలిపారు. హైదరాబాద్‌లోని డీజీపీకి విజ్ఞప్తి చేసేందుకు వచ్చిన హోంగార్డులు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆర్డర్ ఉన్నా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తమ గోడు చెప్పుకునేందుకు వెళ్తే అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. మళ్లీ ‌అదే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోందని ఆవేదన వెలిబుచ్చారు. సీఎం రేవంత్​ హామీ మేరకు తమకు ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.