national

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 7:57 PM IST

ETV Bharat / snippets

ఇంద్రకీలాద్రిపై ప్రతిరోజు లక్ష కుంకుమార్చన కార్యక్రమం - ఎప్పటి నుంచంటే?

Vijayawada Indrakeeladri Sravana Pujalu Dates
Vijayawada Indrakeeladri Sravana Pujalu Dates (ETV Bharat)

Vijayawada Indrakeeladri Sravana Pujalu Dates : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు 5 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు ప్రతిరోజు లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుందని ఆలయ ఈవో కె.ఎస్‌.రామరావు తెలిపారు. నెలరోజుల పాటు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహిస్తారన్నారు. అలాగే ఈనెల 16వ తేదీన శ్రావణమాస వరలక్ష్మీవ్రతం సందర్భంగా అమ్మవారు వరలక్ష్మిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. అదేవిధంగా ఈనెల 18 నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తామని వెల్లడించారు. దీంతో ఆ మూడు రోజులు అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నామన్నారు. అంతేగాక అమ్మవారికి నిర్వహించే అన్ని నిత్య కైంకర్యాలను దేవస్థాన అర్చకులు మాత్రమే చేస్తారని ఆలయ ఈవో వివరించారు.

ABOUT THE AUTHOR

...view details