ETV Bharat / snippets

తిరుమలలో బ్రహ్మోత్సవాలు - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

CHANDRABABU IN SRIVARI BRAHMOTSAVAM
CHANDRABABU IN SRIVARI BRAHMOTSAVAM (ETV Bharat)

CM Chandrababu Tirumala Schedule: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈనెల 4, 5 తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడలో బయలుదేరి ఐదు గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న సీఎం, సాయంత్రం ఆరున్నరకు పద్మావతి గెస్ట్ హౌస్​కు చేరుకోనున్నారు.

రాత్రి 8 గంటలకు శ్రీ బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. రాత్రి 9 గంటలకు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు సందర్భంగా చంద్రబాబు దంపతులు సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం పెదశేష వాహన సేవలో చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. అనంతరం శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్​లో రాత్రి బస చేయనున్నారు. 5వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీవకుళామాత కేంద్రీకృత వంటశాలను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు రేణిగుంట ఎయిర్​పోర్టు నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.