ETV Bharat / state

తొలిరోజు బాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారు - ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు - Dussehra Celebrations 2024 - DUSSEHRA CELEBRATIONS 2024

Dussehra Celebrations 2024: జయదుర్గా జయజయ దుర్గా నామసంకీర్తనతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి సమన్వితే అంటూ లోకపావని- భక్తుల పాలిట కల్పవల్లి జగన్మాతను ఆర్తిగా భక్తులు వేడుకుంటున్నారు. దసరా ఉత్సవాల తొలిరోజున బాలా త్రిపురసుందరిదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణం కిక్కిరిసింది. భక్తులకు ఎలాంట అసౌకర్యం లేకుండా దేవస్థానం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

Dussehra Celebrations 2024
Dussehra Celebrations 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2024, 8:33 PM IST

Dussehra Celebrations 2024 First Day at Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దశావతారాల్లో అమ్మ దివ్యమంగళ స్వరూపాలను వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. ఉత్సవ వెలుగులతో ఇంద్రకీలాద్రి అపర కైలాసక్షేత్రమై భక్తులకు ఆహ్వానం పలుకుతోంది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష పూజలు నిర్వహించి జగన్మాతను బాలాత్రిపురసుందరీదేవిగా అలంకరించారు.

మొదటి రోజు తొమ్మిది గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించాలని తొలుత భావించినా ఓ అరగంట ముందే అప్పటికే క్యూలైన్లలో భక్తులు బారులు తీరి ఉండడంతో వారిని దర్శనానికి అనుమతించారు. ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి విశేషంగా తరలివచ్చారు. దేవాదాయశాఖ కమిషనర్​ సత్యనారాయణ, ఆలయ ఈవో కె.ఎస్‌. రామరావు, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ ఎస్‌.వి. రాజశేఖరబాబు సతీసమేతంగా అమ్మవారి ఉత్సవ మూర్తుల వద్ద పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి లాంఛనంగా దసరా ఉత్సవాలను ప్రారంభించారు.

తొలిరోజు బాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారు (ETV Bharat)

అనంతరం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్ధసారధి, ఇతర ప్రజాప్రతినిధులు అమ్మవారి తొలి దర్శనం చేసుకుని వేద పండితుల ఆశీస్సులు అందుకున్నారు. సామాన్య భక్తుల సంతృప్తికర దర్శనం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి ఆనం తెలిపారు. దర్శనం కోసం ఏర్పాటు చేసిన ఐదు క్యూలైన్లలో రెండు క్యూ లైన్లు సామాన్య భక్తుల ఉచిత దర్శనం కోసం, వంద రూపాయల టికెట్ల ద్వారా దర్శించినందుకు టికెట్ల ద్వారా దర్శించుకునేందుకు ఒక వరుస, 300 రూపాయల టికెట్లతో దర్శించుకునే వారికోసం ఒక వరుస, మూడోది 500 రూపాయల క్యూ లైన్లుగా ఏర్పాటు చేశామన్నారు.

దర్శనార్థం వచ్చే భక్తులు కొండ కింద ఉన్న అన్నదాన భవనంలో అన్న ప్రసాదం అందిస్తున్నామన్నారు. రాష్ట్రం సుఖ సంతోషాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొమ్మిదో తేదీ మూలా నక్షత్రం రోజున మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా కుటుంబ సమేతంగా హాజరుకావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఉత్సవాలు ముగిసేంతవరకు తొమ్మిది రోజులు దుర్గా ఘాట్ వద్ద కృష్ణమ్మకు నవ హారతులు కార్యక్రమం జరుగుతుందన్నారు.

అమ్మవారి ఆలయంలోని ఆరో అంతస్తులో మూలవిరాట్టు మాదిరిగానే ఉత్సవ మూర్తిని కూడా బాలా త్రిపురసుందరీదేవిగా అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. లలితా సహస్రనామ సహితంగా కుంకుమ పూజల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి పంచహారతులు అనంతరం ఉభయదాతలకు అమ్మవారి దర్శనం కలిపించారు. త్రిపురుని భార్య త్రిపురసుందరీ దేవి. అంటే పరమేశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. త్రిపురాత్రయంలో బాలాత్రిపురసుందరీ దేవి తొలి దేవత. అందుకనే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని తొలిరోజున బాలాత్రిపురసుందరీ దేవిగా అలంకరణ చేస్తారు.

ముంబయికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సౌరబ్ గౌర్, కడప జిల్లాకు చెందిన వ్యాపారి సీఎం రాజేష్‌ అమ్మవారికి వజ్రాల కిరీటం, వజ్రాల సూర్యచంద్రులను సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తులు హైమావతి, సూర్యకుమారి అమ్మవారికి నత్తు, బొట్టు చేయించారు. వీటిని దసరా తొలిరోజు దేవాదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ, ఈవో రామరావుకు అందజేశారు. వీటిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనాచౌదరి తిలకించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాతలకు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం నుంచి అమ్మవారి మూలవిరాట్టు అలంకరణలో ఈ ఆభరణాలను వినియోగించనున్నట్లు ఆలయ పండితులు తెలిపారు.

శ్రీ దుర్గా భవాని నామ సంకీర్తనలు ఆడియో క్యాసెట్లు, పుస్తకాలను మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్ధసారధి ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయమూర్తులు తొలిరోజు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేశారని తమ కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్సవాలు ప్రారంభం రోజున 56 మంది సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ నిర్వహణ సేవా కమిటీని ప్రకటించింది. గత పాలకమండలిలో సభ్యులుగా సేవలందించిన వారితోపాటు దాతలు, మహాకూటమి పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ కమిటీలో ఉన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరు డాక్టరు సృజన, ఇతర అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ, ఏర్పాట్లను సమీక్షిస్తూ ఎవరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా తగిన సూచనలు చేస్తున్నారు. దర్శనం, సేవా టిక్కెట్లు, ప్రసాదాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

కృష్ణానది తీరంలో జల్లుస్నానాలు అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన క్యూల్లో వచ్చే భక్తులకు ఎక్కడికక్కడ తాగునీరు, పాలు అందిస్తున్నారు. సాధారణ భక్తుల దర్శనాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు వీఐపీ, వీవీఐపీ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగుల దర్శనాలకు ప్రత్యేక సమయాలను కేటాయించి వారి కోసం వాహనాలు ఏర్పాటుతోపాటు వీల్‌చైర్‌ ద్వారా యువ వాలంటీర్లు వారితో దర్శనం చేయిస్తున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - శ్రీవారి వాహన సేవల పూర్తి వివరాలు ఇవే

సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి నిధులివ్వాలి - తిరుపతి సభలో "వారాహి డిక్లరేషన్"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.