Kishan Reddy On Jamili Elections :దేశవ్యాప్తంగా ఐదేళ్ల పాటు ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, తద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకంగా మారాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కొన్నిసార్లు సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉందన్నారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఈ దిశగా ప్రధాన అడ్డంకిగా ఉన్న అసెంబ్లీలు, పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికలకు ఫుల్స్టాప్ పెట్టి జమిలి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం స్వాగతించదగిన పరిణామం అన్నారు.
జమిలి ఎన్నికల నిర్వహణ అమలుకు కమిటీ : కిషన్ రెడ్డి
Etv Bharat (Etv Bharat)
Published : Sep 19, 2024, 3:19 PM IST
వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ కారణంగా ఖజానాపై ఆర్థికంగా చాలా భారం పడుతోందని చెప్పారు. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం కారణంగా అవుతున్న ఖర్చు రూ.4,500 కోట్ల పైమాటేనన్నారు. త్వరలోనే జమిలి ఎన్నికలకు కేంద్రం కమిటీ ఏర్పాటు చేయనుందని తెలిపారు.