ETV Bharat / entertainment

కిరాక్ పుట్టించేలా 'పుష్ప 2' శ్రీలీల స్పెషల్​​ సాంగ్ ప్రోమో - మీరు చూశారా? - KISSIK SONG PROMO

పుష్ప 2లోని 'కిస్సిక్'​ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్ - ఫుల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa 2 kissik song Promo Released
Pushpa 2 kissik song Promo Released (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2024, 10:38 AM IST

Updated : Nov 23, 2024, 11:34 AM IST

Pushpa 2 kissik song Promo Released : దర్శకుడు సుకుమార్ తెరకెక్కించే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్​కు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. 'పుష్ప' ఫ్రాంచైజీలో సాంగ్స్ మాత్రమే కాదు... సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటే కళ్ళు మూసుకుని మరీ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. ఆయన మొదటి సినిమా 'ఆర్య'లో 'అ అంటే అమలాపురం' నుంచి 'రంగస్థలం'లో 'జిల్ జిల్ జిగేల్ రాణి' వరకు, ఆ తర్వాత పుష్పలో 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' అన్నీ శ్రోతలను ఉర్రూతలూగించినవే.

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ - సుకుమార్ - రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్​ కలిసి చేసే సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్​ వేరె లెవెల్ ఉంటాయి. శ్రోతలను మరింత ఉర్రూతలూగిస్తాయి. ఇక ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్'లో అంతకుమించి అనేలా శ్రీలీల 'కిస్సిక్​' సాంగ్ రెడీ అయిందని అర్థమైంది. నవంబర్‌ 24న దీన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ 'కిస్సిక్'​ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే సాంగ్​ అంతకు మించి అనే ఫీలింగ్ కలిగిస్తోంది.

గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 'పుష్ప: ది రైజ్'లో 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' సాంగ్​ ఎంతటి ప్రేక్షకదరణ పొందిందో తెలిసిన విషయమే. స్టార్ హీరోయిన్ సమంత ఈ పాటలో చిందులేశారు. అది ప్రేక్షకులను ఓ ఊపు ఉపేసింది. అందుకే ఇప్పుడు పుష్ప 2 స్పెషల్ సాంగ్​పై అంచనాలు భారీగా పెరిగాయి.

కాగా, 'కిస్సిక్' సాంగ్​లో యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోయిన్, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల, అల్లు అర్జున్​తో కలిసి చిందులేసింది. ఇప్పటికే విడుదలైన శ్రీలీల సాంగ్ ఫస్ట్ లుక్ వైబ్రెంట్ ఫీలింగ్​ను ఇచ్చేసింది.

పుష్ప 2 : ది రూల్' కాస్ట్ విషయానికొస్తే, భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ నటించారు. జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ, ధనుంజయ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ సినిమాను భారీ బడ్జెట్​తో నిర్మించారు.

పవన్​ కల్యాణ్​పై హీరో నాని కామెంట్స్​ - ఏం చెప్పారంటే?

రెహమాన్‌ విడాకులతో లింక్‌ రూమర్స్​ - క్లారిటీ ఇచ్చిన మోహినిదే

Last Updated : Nov 23, 2024, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.