national

ప్రభుత్వ భూముల పరిరక్షణపై సర్కారు ఫోకస్ - ఫిర్యాదులకు టోల్​ఫ్రీ నంబర్​ ఇదే!

By ETV Bharat Telangana Team

Published : Jul 28, 2024, 8:09 PM IST

Govt Focus On Land Grabbing Cases
Govt Focus On Land Grabbing Cases (ETV Bharat)

Govt Focus On Land Grabbing Cases :నగరంలో నానాటికీ భూముల ధరలు భారీగా పెరగుతుండటంతో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగరం చుట్టూ ప్రభుత్వ భూములను గుర్తించి వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఎవరైనా సర్కారు భూములను ఆక్రమిస్తే తక్షణం ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. భూ ఆక్రమణలకు సమాచారాన్ని తమకు తెలియజేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఆక్రమణల వివరాలు టోల్ ఫ్రీ నెంబర్ 1800599 0099, కంట్రోల్ రూమ్ 04029560509, 04029560596, 04029565758, 04029560953 సమాచారమివ్వాలని ఆయన కోరారు. వివరాలను directorateofevdm@gmail.com ద్వారా మెయిల్ చేయవచ్చన్నారు. ఆక్రమణల సమాచారం నేరుగా కమిషనర్​ను కలిసి వివరించాలనుకుంటే ముందుగా 7207923085 నెంబర్​కు మేసేజ్​ పంపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details