Theft in Government School :సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్లో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి ఉపయెగించే సామగ్రిని ఎత్తుకెళ్లారు. 50 కేజీల కందిపప్పు, 30 కేజీల నూనె ప్యాకెట్లు, 200ల కోడి గుడ్లు, 15 కేజీల పెసర పప్పు, 5 కేజీల ఉల్లిగడ్డలు, వంట సిలిండర్, కేజీ జీలకర్ర ప్యాకెట్, 25 కేజీల చింతపండు బస్తాను ఎత్తికెళ్లినట్లు హెడ్ మాస్టర్ తెలిపారు.
50 కేజీల కందిపప్పు, 15 కేజీల పెసర పప్పు, 5 కిలోల ఉల్లిగడ్డలు - ప్రభుత్వ పాఠశాలలో చోరీ
HEAD MASTER ABOUT THE INCIDENT (ETV Bharat)
Published : Sep 20, 2024, 6:46 PM IST
పాఠశాల ఆవరణలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్, సరస్వతి దేవి, మహాత్మా గాంధీ విగ్రహాలను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద పిల్లలకు పెట్టే సరుకులని కూడా చూడకుండా సామగ్రిని మొత్తం దొంగిలించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పిల్లలు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.