Published : Jun 18, 2024, 6:55 PM IST
టీజీ పీజీ ఈసెట్ 2024 ఫలితాలు విడుదల - 18,129 మంది అభ్యర్థులు అర్హత
TG PGECET 2024 Results :తెలంగాణ పీజీ ఈసెట్ 2024 ఫలితాలు విడుదలైయ్యాయి. హైదరాబాద్లోని కూకట్పల్లి జెఎన్టీయూహెచ్లో తెలంగాణ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి, జెఎన్టీయూహెచ్ ఇంఛార్జి వైస్ ఛాన్సలర్ బుర్రా వెంకటేశం, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రిలు విడుదల చేశారు. ఈ ఏడాది టీజీపీజీఈసెట్ 2024 పరీక్షకు 20,626 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 18,129 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. త్వరలోనే కౌన్సెలింగ్ తేదీలను వెల్లడించనున్నారు.