ETV Bharat / international

పూర్తి విజయం సాధించే వరకు పోరాటం- ఇప్పటికే 90% కంప్లీట్​!: నెతన్యాహు - Israel Hamas War - ISRAEL HAMAS WAR

Netanyahu On Israel Hamas War : హమాస్‌ సగం బలగాలను అంతం చేశామని, వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. అనేక సమస్యలకు ఇరాన్‌ ముఖ్య కారణమని ఆయన ఆరోపించారు.

Netanyahu
Netanyahu (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 10:15 PM IST

Netanyahu On Israel Hamas War : లెబనాన్‌ సరిహద్దులో తమ లక్ష్యాలను సాధించే వరకు హెజ్‌బొల్లాపై పోరాటం ఆగదని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు. హెజ్‌బొల్లా నుంచి రోజువారీ రాకెట్‌ దాడులను సహించే ప్రసక్తే లేదని తెలిపారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ఆయన, ఇప్పటికే హమాస్‌ సగం బలగాలను అంతం చేశామని చెప్పారు. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని అన్నారు.

"90 శాతం మంది హమాస్‌ రాకెట్లను నాశనం చేశాం. వారి సగం బలగాలను అంతం చేయడమో, బంధించడమో చేశాం. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతాం. మా పౌరులను సురక్షితంగా వారి నివాసాలకు తిరిగి వచ్చేలా చూసే హక్కు మాకుంది. అదే పని మేం చేస్తున్నాం. మా లక్ష్యాలను చేరేవరకు హెజ్‌బొల్లాపై పోరాటం కొనసాగిస్తాం. ఏడాది కాలంగా ఈ పరిస్థితులను సహిస్తూనే వస్తున్నాం. అయినప్పటికీ ఇక జరిగింది చాలు అని చెప్పేందుకే ఇక్కడకు వచ్చాను" అని ఐరాస వేదికగా బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొన్నారు.

అది ఆపాల్సిందే!
గతేడాది అక్టోబర్‌ 7న తమ దేశంపై హమాస్‌ మెరుపుదాడి అనంతరం ప్రతిస్పందనను నెతన్యాహు సమర్థించుకున్నారు. ఈసారి ఐరాస సమావేశాలకు రావాలనే ఉద్దేశం లేనప్పటికీ, తమపై కొన్ని దేశాధినేతలు చేసిన అవాస్తవాలను ఖండించడానికే వచ్చానన్నారు. ఇజ్రాయెల్‌ శాంతిని కోరుకుంటుదని తెలిపారు. అనేక సమస్యలకు ఇరాన్‌ ముఖ్య కారణమని బెంజమిన్‌ నెతన్యాహు ఆరోపించారు. చాలా కాలంగా యావత్ ప్రపంచం ఇరాన్‌ను బుజ్జగిస్తూ వస్తోందని, దానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

భూతల దాడులకు సిద్ధం?
లెబనాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌ ముందుగా హెచ్చరించినట్లుగానే మరో అడుగు ముందుకేసింది. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా భూతల దాడులు చేసేందుకు గాను సరిహద్దు ప్రాంతంలో వేల సంఖ్యలో యుద్ధ ట్యాంకర్లను మోహరించింది. దీంతో ఏ క్షణమైనా గ్రౌండ్‌ ఆపరేషన్‌ చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మరోవైపు, ఇరాన్ రక్షణశాఖ మంత్రి బ్రిగేడియర్ జనరల్ అజీజ్‌ నాసిర్జాదేహ్‌, ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌తో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకోవాలని కోరారు. ఆ దేశ దౌత్యవేత్తలను బహిష్కరించాలని అడిగారు. అలాగే నెతన్యాహు ప్రభుత్వంపై ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌ ముందు లొంగిపోవద్దని యెమెన్‌కు చెందిన హూతీ చీఫ్‌ అబ్దుల్ మాలిక్ కూడా హెచ్చరించారు.

సరిహద్దుల్లో భారీగా యుద్ధ ట్యాంకులు- రంగంలోకి రిజర్వ్​ బలగాలు- లెబనాన్​పై ఇజ్రాయెల్ భూతల దాడి? - Israel Ground Invasion Of Lebanon

కాల్పుల విరమణకు నో- హెజ్​బొల్లాపై భూతల దాడులకు ఇజ్రాయెల్ ఆదేశం! - Israel Attack On Hezbollah

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.