ETV Bharat / snippets

కేసీఆర్​ను మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది: డీకే అరుణ

MAHABUBNAGAR MP DK ARUNA
DK ARUNA COMMENTS ON HYDRA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2024, 5:24 PM IST

DK Aruna Fires on Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంచులను సమకూర్చడమే హైడ్రా లక్ష్యమని మహబూబ్​నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ప్రజల దృష్టిమరల్చడానికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ఉన్నఫళంగా నిరాశ్రయులను చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం బెంబేలెత్తిస్తోందని, హైదరాబాద్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ రావాలంటే పెట్టుబడి దారులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్​ను మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. వక్ఫ్​ యాక్ట్ 2024 సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ రేపు హైదరాబాద్​కు రాబోతుందన్నారు. తాజ్​కృష్ణ హోటల్​లో రేపు కమిటీని కలిసి వినతిపత్రాలు ఇవ్వవచ్చని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.