ETV Bharat / entertainment

ఓటీటీలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సంచలనం 'స్త్రీ 2' - స్ట్రీమింగ్ ఎందులో అంటే? - Shraddha Kapoor Stree 2 OTT - SHRADDHA KAPOOR STREE 2 OTT

Shraddha Kapoor Stree 2 OTT : బాలీవుడ్ బాక్సాఫీస్ ముందు రీసెంట్​గా సంచలనం సృష్టించిన సినిమా 'స్త్రీ 2'. R సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని మూవీ లవర్స్​ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇప్పుడు వారి ఎదురు చూపులకు ఫుల్‌ స్టాప్‌ పెట్టింది స్త్రీ 2.

source ANI and Getty Images
Shraddha Kapoor Stree 2 OTT (source ANI and Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2024, 10:19 AM IST

Updated : Sep 26, 2024, 10:28 AM IST

Shraddha Kapoor Stree 2 OTT : బాలీవుడ్ బాక్సాఫీస్ ముందు రీసెంట్​గా సంచలనం సృష్టించిన సినిమా 'స్త్రీ 2'. స్టార్ యాక్టర్లు శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్‌ రావు జంటగా కలిసి నటించారు. ఇటీవలే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్​ను అందుకుంది.

Amazon Prime Video Stree 2 : దీంతో స్త్రీ 2 సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని మూవీ లవర్స్​ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇప్పుడు వారి ఎదురు చూపులకు ఫుల్‌ స్టాప్‌ పెట్టింది స్త్రీ 2. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ఇది ప్రస్తుతానికి ఫ్రీగా అందుబాటులో లేదు. అద్దె ప్రాతిపదికన రూ.349కు స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ చిత్రానికి అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సుమారు రూ.600 కోట్ల వరకు వసూళ్లను సాధించి బాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లను అందుకున్న చిత్రంగా కొత్త రికార్డును నెలకొల్పింది.

Stree 2 Movie Story : 2018లో శ్రద్ధా కపూర్, రాజ్‌ కుమార్‌ రావు కాంబోలో వచ్చింది 'స్త్రీ'. అప్పట్లో ఈ సినిమా బాగా హిట్ అయింది. ప్రస్తుతం హాట్​స్టార్​లో అందుబాటులో ఉంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చింది స్త్రీ 2. హారర్‌ కామెడీ ఎంటర్​టైనర్​గా ఈ సినిమా రూపొందింది. ఆగస్టు 15న బాక్సాఫీసు ముందు రిలీజైంది. చందేరీ గ్రామంలో స్త్రీ సమస్య తొలగిందని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో సర్కటతో మళ్లీ కొత్త సమస్య ఎదురవుతుంది. గ్రామంలో మోడ్రన్‌గా ఉండే అమ్మాయిలను బాగా ఇబ్బందులు పెడుతుంటాడు సర్కట. అయితే ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావ్‌), బిట్టు (అపర్ శక్తి ) జన (అభిషేక్ బెనర్జీ), రుద్ర (పంకజ్ త్రిపాఠి)తో పాటు శ్రద్ధా కపూర్ ఎలా ఎదుర్కొన్నారు? అన్న కథాంశంతో ఈ స్త్రీ 2 తెరకెక్కింది.

స్టార్ హీరో ఇంట్లోకి అద్దెకు దిగుతున్న శ్రద్ధా కపూర్​ - వామ్మో నెలకు అన్ని లక్షలా? - Shraddha Kapoor New House

టాలీవుడ్ అప్​కమింగ్ బడా ప్రాజెక్ట్స్​ - ​ఈ స్టార్​ హీరోల సరసన సొగసరి వీరేనా? - Tollywood Upcoming Movies Heroines

Last Updated : Sep 26, 2024, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.