ETV Bharat / business

ఆన్​లైన్ షాపింగ్ చేస్తున్నారా? తొందరపడితే డబ్బులు పోతాయ్ - జర జాగ్రత్త! - Online Shopping Traps - ONLINE SHOPPING TRAPS

Psychological Traps Of Online Shopping : ఒక వస్తువు మార్కెట్‌ ధరకంటే తక్కువ ధరకు వస్తుందని, అది కూడా లిమిటెడ్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంటుందని చెబితే ఏం చేస్తాం? వెంటనే దానిని కొనేయాలని ఆశపడతాం. ఈ బలహీనతనే క్యాష్ చేసుకుంటున్నారు ఆన్​లైన్ మోసగాళ్లు. ఆన్​లైన్ కొనుగోలుదారులను నిండా ముంచేస్తున్నారు. మరి ఈ మోసాల నుంచి ఎలా బయటపడాలంటే?

Online Shopping
Online Shopping (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 11:08 AM IST

Psychological Traps Of Online Shopping : 'ఆలసించిన ఆశా భంగం, త్వరపడండి - మంచి తరుణం మించిన దొరకదు' అంటూ ఒకప్పుడు వ్యాపారులు ప్రజలకు వస్తువులను అంటగట్టేవారు. ఇప్పుడు ఇదే ట్రిక్కును ఈ-కామర్స్ వెబ్​సైట్లు పాటిస్తున్నాయి. కానీ కాస్త స్టైలిష్ భాషలో - లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్, ఫెస్టివ్​ షేల్స్ అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.​ దీనితో ప్రజలు కూడా ఆన్​లైన్ షాపింగ్ విపరీతంగా చేసేస్తున్నారు. ఒక వస్తువు మార్కెట్ ధర కంటే, చాలా తక్కువ ధరకు దానిని సొంతం చేసుకుంటున్నామనే భ్రమలో ఉంటున్నారు. దీనినే అవకాశంగా తీసుకుని, ఆన్​లైన్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. స్పామ్ ఈ-మెయిళ్లు​, మెసేజులు, లింకులు​ పంపిస్తూ ప్రజలను బురిటీ కొట్టిస్తున్నారు. అందుకే ఇలాంటి మోసాల బారిన పడకుండా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

బిగ్ ట్రాప్​ : పండగలు, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో, ఆన్​లైన్​లో ఎక్కడ చూసినా డిస్కౌంట్లు, ఆఫర్లు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఈ-కామర్స్ సంస్థలు ఇలాంటి ప్రకటనలు ఇస్తుంటాయి. దీనిని అవకాశంగా తీసుకుని, అచ్చంగా ఒరిజినల్ ఆఫర్స్​ను తలపించేలా స్పామ్​​ ఇ-మెయిళ్లను, మెసేజ్​లను సైబర్ నేరగాళ్లు, ఆన్​లైన్ మోసగాళ్లు పంపిస్తుంటారు. వీటి ట్రాప్​లో పడితే ఇక అంతే సంగతులు.

ఉదాహరణకు, వెంకట్రావుకు ఒక ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ నుంచి ప్రత్యేక డిస్కౌంటు ఇస్తున్నట్లుగా ఈ-మెయిల్‌ వచ్చింది. ఈ ఆఫర్‌ కేవలం 2 గంటల పాటే అందుబాటులో ఉంటుందని, అది కూడా పరిమితంగానే వస్తువులు అందుబాటులో ఉన్నాయని అందులో ఉంది. ఆలస్యం చేస్తే, ఈ మంచి అవకాశం చేజారి పోతుందని భావించాడు వెంకట్రావు. ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, తనకు వచ్చిన ఈ-మెయిల్​లోని లింక్​పై క్లిక్ చేశాడు. అందులో తన క్రెడిట్‌ కార్డు వివరాలన్నీ నమోదు చేశాడు. అంతే! ఆ కార్డులోని డబ్బులు మొత్తం పోయాయి. అప్పుడు అర్థమైంది తను మోసపోయానని. మరి ఇలాంటి పరిస్థితే మనకు కూడా వస్తే? అందుకే ఇలాంటి ఆన్​లైన్ షాపింగ్ మోసాలు జరిగినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏం చేయాలి?

  • పరిమిత కాలపు (లిమిటెడ్ టైమ్​) ఆఫర్లు అంటూ వచ్చే ఈ-మెయిళ్లు, మేసేజ్​లు విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
  • ఈ-మెయిల్‌లో వచ్చిన లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు.
  • దీనికి బదులుగా అధికారిక ఈ-కామర్స్​ వెబ్​సైట్​లోకి వెళ్లాలి.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ పరిమిత కాలం ఆఫర్లు అంటూ వచ్చే సందేశాలను పట్టించుకోవద్దు.
  • మోసపూరిత ఈ-మెయిళ్లలో కంపెనీల పేర్లకు సంబంధించి చాలా అక్షర దోషాలు ఉంటాయి. వీటిని కాస్త జాగ్రత్తగా గుర్తించాలి.
  • పేమెంట్స్​ విషయానికి వస్తే రెండంచెల భద్రతను (టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌) వినియోగించాలి. దీనివల్ల మీకు అదనపు రక్షణ ఉంటుంది.
  • ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు తక్కువ పరిమితి ఉన్న క్రెడిట్​ కార్డులను వాడాలి.
  • ఆఫర్లు, డిస్కౌంట్లు గురించి ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకున్నాకే, కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.
  • ఒకవేళ మీరు మోసపోయినట్లు గుర్తిస్తే, వెంటనే మీ బ్యాంకుకు, సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్​మెంట్ వారికి ఫిర్యాదు చేయాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.