national

ETV Bharat / snippets

డిగ్రీ చదవకున్నా ఎంబీబీఎస్​గా బిల్డప్ - బయటపడ్డ 50 మంది నకిలీ వైద్యుల బండారం

Fake Doctors in Hyderabad
50 మంది నకిలీ వైద్యుల బండారం బట్టబయలు - ఇద్దరు అరెస్టు (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 12:35 PM IST

Fake Doctors in Hyderabad :తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఐడీపీఎల్‌, చింతల్‌, షాపూర్‌ నగర్‌ పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీ బయాటిక్స్‌ ఇస్తున్నట్లు గుర్తించారు. తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక, వారికి అనుసంధానంగా మెడికల్‌ షాపులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. దాదాపు యాభై మంది నకిలీ వైద్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, ఇద్దరిని జైలుకు పంపినట్లు వెల్లడించారు. తనిఖీల్లో వైద్యులు ప్రతిభాలక్ష్మి, కిరణ్‌ కుమార్‌, సన్నీ డేవిస్‌, ఇమ్రాన్‌ అలీ, విష్ణు, పాండు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details