HC Notices To MLA's : పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఓ పార్టీ గుర్తుపై గెలిచి, ఇంకో పార్టీలోకి వెళ్లడం రాజ్యాంగ విరుద్ధమని, 10వ షెడ్యూల్ ప్రకారం వీరిపై వేటు వేయాలంటూ పాల్ పిటిషన్‌లో కోరారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలందరినీ అనర్హులుగా ప్రకటించాలని కేఏ పాల్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
పార్టీ ఫిరాయింపులపై కేఏ పాల్ పిటిషన్ - 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
Published : Sep 23, 2024, 4:18 PM IST
దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్ రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల జీతభత్యాలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని, ఎమ్మెల్యేలను మార్కెట్‌లో కొనుగోలు చేసే వస్తువుల్లాగా చూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ ధర్మాసనాన్ని కోరారు. వాదనలు విన్న హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌తో పాటు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.