'పోలీసులు మీకు ఫోన్ చేయరు - కాల్ చేస్తోంది మేం కాదు కేటుగాళ్లు' - సైబర్ నేరాలపై డీజీపీ
Published : Jul 19, 2024, 12:47 PM IST
DGP Jithender Tweet On Cyber Frauds : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా పోలీస్ అధికారి డీపీతో ఉన్న నెంబర్‌తో వాట్సాప్ కాల్ చేసి బెదిరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ సంబంధిత వీడియోను ఎక్స్‌లో రాష్ట్ర డీజీపీ జితేందర్ పోస్ట్ చేశారు. 'సైబర్ నేరగాళ్లు పోలీస్‌లా మాట్లాడుతూ మీ కుటుంబ సభ్యులు కేసుల్లో ఇరుక్కున్నారని చెబుతారు. డబ్బు పంపిస్తే సెటిల్ చేసుకోవచ్చు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాదని సైబర్ కేటుగాళ్లు నమ్మిస్తారు" అలాంటి వాటిని నమ్మకూడదని డీజీపీ సూచించారు. పొరపాటున సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చేయాలన్నారు.