నేడు ప్రధాని, కేంద్ర హోం మంత్రితో సీఎం రేవంత్ భేటీ!
Published : Jul 4, 2024, 8:04 AM IST
|Updated : Jul 4, 2024, 8:21 AM IST
CM Revanth Expected to Meet PM Modi in Delhi :దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలను సీఎం రేవంత్ ప్రధాని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా దిల్లీకి వెళ్లారు.