సూర్యాపేట ఎస్పీ పేరుతో ఫేక్ ఫేస్బుక్ ఖాతాలు - 'సైబర్ కేటుగాళ్లను నమ్మి మోసపోవద్దు'
Published : May 29, 2024, 4:24 PM IST
Suryapet SP Fake Facebook ID : ప్రముఖుల ఖాతాలు ఉపయోగించి నగదు కాజేయడం సైబర్ నేరగాళ్లు ఇటీవల ఎక్కువగా చేస్తున్నారు. తాజాగా సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే పేరుతో రెండు ఫేస్బుక్ నకిలీ ఖాతాలు సృష్టించి మెసేజ్లు, ప్రెండ్ రిక్వెస్ట్లు పెడుతున్నారని ఆయన తెలుసుకున్నారు. దీంతో స్పందించి తన పేరుతో వచ్చిన ఖాతాలకు డబ్బులు పంపి మోసపోవద్దని తెలిపారు. తన మిత్రుడైన సంతోష్ అనే పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కారణంగా ఇల్లు ఖాళీ చేసి వెళుతున్నారని, అందులో ఉన్న ఫర్నిచర్ అతి తక్కువ ధరకు ఇప్పిస్తామని ఎస్పీ పేరుతో మెసేజ్ చేస్తున్నారని తెలిపారు. ఈ ఫర్నీచర్ కావాలంటే ముందుగానే డబ్బు చెల్లించాలని 9584041768 నంబర్ తో కాల్ చేశారని అన్నారు. అనుమానం వచ్చిన ఓ ఖాతాదారుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది.