Stone Fruits Health Benefits : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సమతుల పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలోనే కొందరు డైలీ వివిధ రకాల ఫ్రూట్స్‌ను తీసుకుంటుంటారు. అయితే.. పండ్లలోనూ "స్టోన్ ఫ్రూట్స్" తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు. క్యాన్సర్లు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహమే కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు. ఇంతకీ.. స్టోన్ ఫ్రూట్స్ అంటే ఏమిటి? ఎలాంటి పోషకాలుంటాయి? ఆ పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నార్మల్‌గా చాలా ఫ్రూట్స్‌లో గింజలు ఉండడం మనకు తెలిసిందే. అయితే.. కొన్నింటిలో పండ్లను కప్పి ఉంచే ఒక చిన్న రాయి లాంటి దృఢమైన నిర్మాణం ఉండి.. దాని చుట్టూ పండు గుజ్జు ఉంటుంది. ఇలాంటి పండ్లనే ‘స్టోన్ ఫ్రూట్స్’ అంటారు. చెర్రీస్, రాస్బెర్రీ, మామిడి, ఆప్రికాట్స్, పీచ్, ప్లమ్స్.. వంటి కొన్ని పండ్లు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ పండ్లు అమోఘమైన రుచిని అందించడమే కాకుండా.. వీటిలో ఆరోగ్యాన్ని, అందాన్ని పెంపొందించే ఔషధ గుణాలూ సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
మంచి ఇమ్యూనిటీ బూస్టర్ : కాలం మారే కొద్దీ వివిధ రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం కామన్! అయితే.. వాటి బారిన పడకుండా ఉండాలంటే బాడీలో తగినంత రోగనిరోధక శక్తి ఉండడం చాలా అవసరం. అందుకు.. స్టోన్ ఫ్రూట్స్ చాలా బాగా సహాయపడతాయంటున్నారు ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్రీలత. ఈ పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఫ్రీరాడికల్స్ నుంచి మంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి.. శరీరం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు.
రక్తపోటును నియంత్రిస్తాయి! : సాధారణంగా మనల్ని అప్పుడప్పుడు అలసట, నీరసం.. వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అయితే.. వాటి నుంచి ఉపశమనం పొంది నరాలు, కండరాలు రిలాక్స్ కావాలంటే స్టోన్స్ ఫ్రూట్స్ తీసుకోవడం చక్కటి మార్గమంటున్నారు వైద్యులు. ప్రధానంగా పీచ్, ప్లమ్.. వంటి ఫ్రూట్స్‌లో పొటాషియం స్థాయులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల అలసట, నీరసం.. వంటివి దూరమవుతాయి. అంతేకాదు.. చెర్రీ పండ్లతో పాటు ఇతర స్టోన్ ఫ్రూట్స్ రక్తనాళాల్లో రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేసి బీపీని అదుపులో ఉంచుతాయని చెబుతున్నారు డాక్టర్ శ్రీలత.
క్యాన్సర్లను అడ్డుకుంటాయి! : నేటిరోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్లే వివిధ రకాల క్యాన్సర్లకు కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అలాగే.. కొందరిలో వంశపారంపర్యంగానూ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. ముందుగా జాగ్రత్తగా క్యాన్సర్ల బారిన పడకుండా ఉండాలంటే స్టోన్ ఫ్రూట్స్‌ని ఆహారంలో చేర్చుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలోని.. ఫైటోకెమికల్స్ కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. ఫలితంగా క్యాన్సర్ ముప్పును చాలా వరకు తప్పించుకోవచ్చంటున్నారు. అలాగే.. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(NIH) పరిశోధకుల బృందం చేపట్టిన ఓ పరిశోధనలోనూ స్టోన్ ఫ్రూట్స్‌లో ఉండే ఫైటో కెమికల్స్ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
కిడ్నీ వ్యాధి ముప్పు భయపెడుతోందా? - ఈ 5 పండ్లు తినమని సలహా ఇస్తున్న నిపుణులు!
ఈ పండ్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయట! - అవేంటో మీకు తెలుసా?