Mohammed Shami Bowling Practise : టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తాజాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మెరిశాడు. ప్రస్తతుం గాయం నుంచి కోలుకుంటున్న అతడు, న్యూజిలాండ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
మోకాలి వాపు కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న షమీ ప్రస్తుతం ఎన్‌సీఏలో విశ్రాంతి తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాడు . ఈ క్రమంలోనే అతడు బ్యాండేజీతోనే బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం షమీ తన ప్రాక్టీస్‌లో వంద శాతం ఫిట్‌నెస్ ఉన్న బౌలర్ లాగే బంతులను వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాడని, త్వరలోనే పూర్తిగా కోలుకుని మునుపటిలా ఆడేందుకు సిద్ధం అవుతున్నాడట. ఇందులో భాగంగా తొలుత నెట్స్‌లో తక్కువ రన్నప్‌తో బాల్‌ను నెమ్మదిగా వేయడం ప్రారంభించాడని, ఆ తర్వాత వేగం పెంచుకుంటూ వెళ్లాడని అక్కడి వారు చెప్పుకుంటున్నారు. ఎన్‌సీఏ బౌలింగ్ కోచ్ ట్రాయ్ కూలే సమక్షంలో షమీ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే వచ్చేస్తాడా?
వన్డే ప్రపంచ కప్ తర్వాత షమీ తన మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నాడు. దీంతో దాదాపు ఎనిమిది నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. అయితే న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌కైనా అతడు అందుబాటులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆలోపు దేశవాళీ క్రికెట్‌లో ఆడి ఫిట్‌నెస్, ఫామ్ నిరూపించుకుందామని భావించిన షమీకి షాక్ తగిలింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మోకాలిలో నొప్పిగా అనిపించడం వల్ల డాక్టర్లను కలిశాడు. ఇక వైద్యులు అతడ్ని పరీక్షించి ఆపరేషన్ చేయించుకున్న ప్రదేశంలో వాపు వచ్చినట్లు గుర్తించారు. దీంతో అతడ్ని ఆస్ట్రేలియా సిరీస్‌కు తీసుకెళ్లడం కష్టమేనంటూ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుండటం వల్ల ఎలాగైనా జాతీయ జట్టులోకి రావాలనే ఉద్దేశంతో షమీ ఉన్నట్లు తెలుస్తోంది.
డేంజర్లో షమీ టెస్ట్ కెరీర్! - రీఎంట్రీ ఎప్పుడో?
'అవన్నీ రూమర్స్, ఎవరూ నమ్మవద్దు'- గాయంపై షమీ క్లారిటీ - Mohammed Shami Injury