national

ETV Bharat / snippets

'అంగన్వాడీలకు నాణ్యమైన సరకులు సరఫరా చేయండి - లేదంటే తప్పుకోండి'

Seethakka Review On Anganwadi Issue
Seethakka Review On Anganwadi Contractors (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 9:30 PM IST

Seethakka Review On Anganwadi Contractors : అంగన్వాడీలకు నాణ్యమైన గుడ్లు, సరకులు సరఫరా చేయాలని లేదా తప్పుకోవాలని కాంట్రాక్టర్లను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. సచివాలయంలో అంగన్వాడీలకు సరకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పేద పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

బీఆర్ఎస్ హయాంలోని కాంట్రాక్టర్లను తాము మార్చలేదని, అయితే నాణ్యత పాటించకపోతే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. లబ్ధిదారులు చాలా రోజుల తర్వాత కోడి గుడ్లు వినియోగించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, వారికి అవగాహన కల్పించాలని సీతక్క సూచించారు. కోడి గుడ్ల ధరలు పెంచాలని సప్లయర్లు కోరగా, కాంట్రాక్టు మధ్యలో పెంచడం కుదరదని మంత్రి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details