ETV Bharat / state

ప్రకంపనలు రేపుతోన్న ఫామ్ హౌస్​ పార్టీ : పరారీలో రాజ్‌ పాకాల - పలువురు బీఆర్​ఎస్​ నేతలు అరెస్ట్ - RAID ON KTR RELATIVE

ప్రకంపనలు రేపుతోన్న జన్వాడ ఫామ్ హౌస్​ పార్టీ - రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర ఇంట్లో పోలీసుల సోదాలు - రాజ్ పాకాల ఇంట్లోనూ తనిఖీలు - మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న అధికారులు

JANWADA FARMHOUSE CASE UPDATES
Raid on KTR Relative House and Few BRS Leaders Arrested (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2024, 10:06 PM IST

Updated : Oct 28, 2024, 4:26 PM IST

Raid on KTR Relative House and Few BRS Leaders Arrested : జన్వాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఎక్సైజ్ పోలీసులు ఏ1గా ఫామ్ హౌజ్ సూపర్ వైజర్ కార్తీక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చారు. మరో కేసులో మోకిలా పోలీసులు ఏ1గా రాజ్ పాకాల, ఏ2గా విజయ్ మద్దూరిలను చేర్చారు. ఇప్పటికే కేటీఆర్ ​బావమరిది రాజ్‌ పాకాల పరారీలో ఉన్నారు. శనివారం రాత్రి పదిన్నర సమయంలో పార్టీ జరుగుతుందన్న సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో ఉన్న పురుషులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా విజయ్ మద్దూరికి కొకైన్ టెస్ట్ పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది.

మహిళలు మాత్రం టెస్ట్​కు నిరాకరించినట్లు పోలీసులు ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు. రాత్రి స్వాధీనం చేసుకున్న మద్యంతో పాటు అక్కడ లభించిన వస్తువులకు సంబంధించి పోలీసులు పంచనామా పూర్తి చేశారు. పార్టీలో పాల్గొన్న మిగతా వారికి పోలీసులు నోటీసులిచ్చి పంపించారు. తిరిగి ఇవాళ ఉదయం ఫామ్ హౌజ్ వద్దకు నార్సింగి ఏసీపీ చేరుకోగా ప్రధాన గేటుకు తాళం వేసి ఉండడంతో వెనుదిరిగారు. ఎక్సైజ్ అధికారులు మరోసారి ఫామ్ హౌజ్ చేరుకుని దాదాపు రెండు గంటల పాటు పరిశీలించారు.

ఐతే డ్రగ్స్ సేవించినట్లు నిర్ధరణ అయిన విజయ్ మద్దూరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహించారు. అతను వినియోగదారుడు కావడంతో అతను ఎవరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడనే కోణంలో మోకిలా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ పాకాల కంపెనీలో విజయ్ మద్దూరి అనే వ్యక్తి సీఈవోగా పనిచేస్తున్నాడు. రాజ్ పాకాల దీపావళి సందర్భంగా పార్టీ చేసుకుందామని కోరాడని, విజయ్ మద్దూరి చెప్పినట్లు పోలీసులు ఎఫ్​ఐఆర్​లో తెలిపాడు. అప్పటికే తన వద్ద ఉన్న డ్రగ్స్​ను పార్టీలో వినియోగించాలని రాజ్ పాకాల ప్రోత్సహించినట్లు విజయ్ మద్దూరి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

అధికారులను అడ్డుకున్న బీఆర్​ఎస్​ నేతలు : ఈ వ్యవహారానికి సంబంధించి మరింత దర్యాప్తులో భాగంగా రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్​లోని రాజ్ పాకాల నివాసంలో తనిఖీల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజ్ పాకాల నివాసంలో తనిఖీలకు వెళ్లిన అధికారులు, ఆయన సోదరుడు శైలేశ్​ పాకాల నివాసంలో ఉన్నాడనే సమాచారంతో అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, నేతలు అధికారులను అడ్డుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అధికారులే డ్రగ్స్ పెట్టి కేసులు పెడతారని అనుమానం ఉందని ఆరోపించారు.

అనంతరం న్యాయవాది సమక్షంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారుల వైఖరిని నిరసిస్తూ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, నేతలు నిరసన చేపట్టారు. తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పోలీసులు వారిని అరెస్టు చేశారు. శైలేంద్ర నివాసంలో తనిఖీలు పూర్తిచేసిన అధికారులు, రాజ్ పాకాల విల్లా నంబర్ 40లో తనిఖీలు చేశారు. విల్లా నంబర్ 40 తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

కేటీఆర్ బావమరిది ఫామ్​హౌస్​లో అర్ధరాత్రి భారీ శబ్ధాలతో పార్టీ - రైడ్ చేసిన పోలీసులు - డ్రగ్స్ గుర్తింపు

Last Updated : Oct 28, 2024, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.